Begin typing your search above and press return to search.
అదొక్కటే నా కోరిక..ప్రధాని కావాలని నాకేం లేదు
By: Tupaki Desk | 2 May 2018 1:44 PM GMTప్రధానమంత్రి పీఠంపై తనకు మోజు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే తన ప్రయత్నమని పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సీఎం కేసీఆర్ తో దేశ రాజకీయాలపై ప్రగతి భవన్ లో చర్చించారు. ఈ సందర్భంగా కొత్త రాజకీయ కూటమిపై అఖిలేశ్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ప్రగతి భవన్ లోనే ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ - బీజేపీల పాలనతో ప్రజలు విసిగిపోయారని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇది పొలిటికల్ గేమ్ కాదని, మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని వివరించారు. ప్రధాని కావాలన్న కాంక్ష నాకు లేదు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఆర్థికంగా భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైనా ఇప్పటి వరకు కేంద్రంలో పాలన చేసిన పార్టీల వల్ల ఇవాళ దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో రైతులు - మైనార్టీలు - దళితులు ఇలా ఏ వర్గం సంతోషంగా లేవన్నారు. అందుకే దేశ రాజకీయాల్లో పరివర్తన రావాల్సిన తరుణం ఆసన్నమయిందని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే పలు అంశాలపై చర్చించడానికి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాదు వచ్చారని సీఎం తెలిపారు. గత రెండు మూడు నెలలుగా అఖిలేష్ తో చాలాసార్లు టెలిఫోన్ సంభాషణలు కూడా జరిపామని చెప్పారు. తాను చెప్పిన అన్ని అంశాలపై అఖిలేష్ సంపూర్ణ మద్దతు తెలిపారని సీఎం చెప్పారు. ఇదంతా ఉత్తిదే అని, కేసీఆర్ ఏదో చిల్లరమల్లర రాజకీయం కోసం, 2019 ఎన్నికల కోసం చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారని సీఎం తెలిపారు. వారనుకున్నట్లు ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, దేశ రాజకీయ ప్రక్రియలో గుణాత్మక మార్పు తీసుకు రావాలంటే ఎంతో ప్రయాస చేయాల్సి ఉంటుందని, ఎన్నో పార్టీలను కలవాల్సి ఉంటుందని, అందరితో మాట్లాడి ఓప్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే అఖిలేష్ తో ఇవాళ చాలా విషయాలు చర్చించామని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా ఎలా వెళ్లాలి, ఏం చేయాలి అనే దానిపై దేశంలో చాలా మందితో చర్చించాల్సి ఉందన్నారు. అందరితో మాట్లాడిన తరువాత చివరగా ఒక ఎజండాతో ప్రజల ముందుకు వస్తామని ఆయన చెప్పారు.
యూపీ మాజీ సీఎం - సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తేనే బీజేపీని నిలువరించగలమని తెలిపారు. `బీజేపీ ప్రజలను నిరాశపరిచింది. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అందుకే దేశానికి ఒక దిక్సూచి కావాలి. యూపీలో సీఎం - డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించి మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం ఆశించినంత అభివృద్ధి చెందలేదు. సీఎం కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇదొక మంచి ప్రయత్నం. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తాం. హైదరాబాద్ తో మాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలున్నాయి` అని అఖిలేశ్ తెలిపారు.