Begin typing your search above and press return to search.
పథకాలు మావి.. డబ్బులు మాత్రం మీవి
By: Tupaki Desk | 28 Oct 2015 4:43 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాతుర్యం చూసిన కేంద్రమంత్రులు విస్మయానికి గురయ్యారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్రమంత్రులు పలువురిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొచ్చిన వినతులు చూసి కేంద్రమంత్రులతో పాటు..రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్.. మిషన్ కాకతీయ.. రహదారుల అభివృద్ధి.. డ్రైపోర్టు ఏర్పాట్లు ఇలాంటి వాటికి సంబంధించి కేంద్రం సాయం చేయాలని కోరటమే దీనికి కారణం.
మిషన్ కాకతీయ.. వాటర్ గ్రిడ్ పథకాలు తమ మానసపుత్రికలని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటమే కాదు.. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అయితే.. వీటికి అవసరమైన నిధులను కేంద్రం నెత్తిన పెట్టే తెలివితేటలు ఇప్పుడు చర్చగా మారాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పథకాలకు కేంద్రం కాని స్పందించి నిధులు ఇస్తే.. ఆ పథకాల ద్వారా వచ్చే క్రెడిట్ మొత్తం టీఆర్ ఎస్ సర్కారుకే చెల్లుతుంది. అదే సమయంలో నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తే.. కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించటం లేదన్న విమర్శలు ఎక్కు పెట్టే వీలుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివితేటలు ముచ్చటపడేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తమది సంపన్న రాష్ట్రమే అయినప్పటికీ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరటం ద్వారా.. తమను తాము తక్కువ చేసుకోకుండానే.. బెట్టుగా డబ్బులు తెచ్చుకునేలా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని చెప్పొచ్చు. భారీ ప్రాజెక్టులుగా పేరొందిన వాటర్ గ్రిడ్.. మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు సాయం చేయటం అంటే.. పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేమంత చిన్న విషయం కాదు. అందుకేనేమో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినతుల్ని విన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆచితూచి స్పందించారు. కేసీఆర్ వినతులపై తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. కేంద్ర మంత్రుల వద్దకు కేసీఆర్ తీసుకెళుతున్న వినతుల తీరు చూస్తుంటే.. నిధులు మీవి.. ప్రాజెక్టులు.. పేరుప్రఖ్యాతులు మావి అన్న చందంగా ఉన్నాయని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. కేసీఆర్ వినతులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.