Begin typing your search above and press return to search.
పాలనపై కేసీర్ ఫోకస్: కలెక్టర్లతో సమావేశం
By: Tupaki Desk | 11 Feb 2020 10:30 AM GMTతెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. అసెంబ్లీ నుంచి మొదలు పెట్టుకుని మున్సిపాలిటీ వరకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ప్రాథమిక సహకర సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నా వాటిపై అధికార పార్టీ ధీమాగా ఉంది. ఇప్పటికే అత్యధికంగా డైరెక్టర్ స్థానాలు ఏక్రగీవంగా గెలిపించుకున్న టీఆర్ ఎస్ అత్యధిక పీఏసీఎస్ లను తన ఖాతాలో వేసుకోనుంది. ఇక దీని తర్వాత అధికార పార్టీ ఇప్పుడు పరిపాలన దృష్టి పెట్టింది. గతంలో సీఎం కేసీఆర్ ఎన్నికలు అన్ని ముగిసిన తర్వాత మనం అన్ని చేసుకుందాం.. అని పేర్కొన్నారు. అందులో భాగంగా ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్ పెట్టారు.
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో జిల్లా కలెక్టర్లతో విస్తృత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల అందరితో మాట్లాడి జిల్లాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తెచ్చిన పల్లె ప్రగతి - పంచాయతీ - మున్సిపల్ చట్టాలపై సమీక్ష చేసిన అనంతరం అజెండాపై చర్చించినట్లు సమాచారం. భవిష్యత్ లో రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లతో పాటు అధికారులతో చర్చించారు. పల్లెప్రగతి - పట్టణ ప్రగతి - హరితహారం - ఖరీఫ్ కార్యాచరణ - రాష్ట్ర ఆరోగ్ సూచీ తయారీ - ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు - కొత్త రెవెన్యూ చట్టం - పెండింగ్ ప్రాజెక్టులు - కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ కోరారు. సంక్షేమ కార్యక్రమాలు - పథకాల అమలు - అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. ఇక బడ్జెట్ పై కూడా చర్చించినట్లు సమాచారం. మీ జిల్లాకు ఏమేం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కావడం ఇది రెండోసారి. కలెక్టర్లకు ఓ లక్ష్యం - జిల్లాపై ఒక ప్లాన్ ఇచ్చి పంపనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాన్ని పరిపాలనలో మేటిగా నిలపాలని తన ఆశయమని - దానికనుగుణంగా మీరు పని చేయాలని కోరినట్లు సమాచారం.