Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ తో కేసీఆర్ భేటీః కొత్త మంత్రులు వీరే!

By:  Tupaki Desk   |   9 April 2016 1:50 PM
గ‌వ‌ర్న‌ర్‌ తో కేసీఆర్ భేటీః కొత్త మంత్రులు వీరే!
X
త‌ర‌చుగా జరిగేదే అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ - ఉమ్మడి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ల ప్ర‌త్యేక భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. రాజ్‌ భ‌వ‌న్‌ కు వెళ్లిన కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌ న‌ర‌సింహ‌న్‌ తో భేటీ అవ‌డం వెనుక కేబినెట్ మార్పు చేర్పులే ఉండి ఉంటాయ‌ని రాజకీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ముగ్గురు కొత్త‌వారికి బెర్తు ద‌క్కే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

గ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కూడా ఏ మాత్రం చ‌డీ చ‌ప్పుడు లేకుండా కేసీఆర్ పూర్తిచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్‌-కేసీఆర్ స‌మావేశం ఈ చ‌ర్చ‌కు బ‌లం చేకూరుస్తోంది. మంత్రులు నాయిని న‌ర్సింహారెడ్డి - చందూలాల్‌ ను మార్చ‌బోతున్నట్లు స‌మాచారం. బీసీ సంక్షేమ శాఖామంత్రి జోగు రామ‌న్న పేరు తొల‌గించే మంత్రుల పేర్ల‌లో వినిపించిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను మార్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. కొత్త‌గా ఎమ్మెల్యేలు కొండా సురేఖ‌ - కొప్పుల ఈశ్వ‌ర్‌ - ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావుల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని తెలుస్తోంది.