Begin typing your search above and press return to search.
పండగ వేళ గవర్నర్ తో కేసీఆర్ గంటన్నర సమావేశం
By: Tupaki Desk | 14 Sep 2018 6:31 AM GMTదేశంలోని మరే రాష్ట్రంలో కనిపించని సన్నివేశం ఒకటి తెలంగాణ రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటూ ఉంటుంది. గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య సంబంధం.. అనుబంధం చాలా పరిమితంగా ఉంటుంది. చాలా ముఖ్యమైన సందర్భాల్లో.. విశేష సందర్భాల్లోనే వారిద్దరూ భేటీ అవుతుంటారు.
ఇంతకు మినహా ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం అంటూ ఉండదు. దీనికి భిన్నమైన దృశ్యం తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది. చివరకు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రవేశ పెట్టే పథకాల గురించి గవర్నర్ నరసింహన్ ను కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపినట్లుగా తరచూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటుంది.
పవర్లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య బంధం గవర్నర్.. ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. సన్నిహితులైన స్నేహితుల మాదిరి వ్యవహరించినట్లుగా చెబుతారు. మధ్యంతరానికి వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేసీఆర్ కోరటం.. ఆయన్ను ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని గవర్నర్ కోరటం తెలిసిందే.
ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తొలగించాలని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలంటూ గవర్నర్ కు కాంగ్రెస్ తో సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. గవర్నర్ తో భేటీ అయ్యారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ . వినాయకచవితి సందర్భంగా పండుగ శుభాకాంక్షలు చెప్పటంతో పాటు.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై వారిద్దరూ చర్చించుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం పర్యటన.. రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల సన్నాహకాలు.. ఇతర పాలనా అంశాలపై భేటీలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కొండగట్టు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం.. క్షతగాత్రులకు వైద్య సాయంతో పాటు ఇతర అంశాలు కూడా గవర్నర్.. ఆపద్దర్మ సీఎంల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆపద్దర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న తాము..పరిమితులకు లోబడి మాత్రమే పని చేస్తున్నామని.. ఎక్కడా తన పరిధుల్ని దాటలేదంటూ గవర్నర్ నరసింహన్ కు కేసీఆర్ చెప్పినట్లుగా బయటకు వచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని కెమిస్ట్రీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్.. ఆపద్దర్మ ముఖ్యమంత్రి మధ్య ఉందని చెప్పక తప్పదు.