Begin typing your search above and press return to search.
చిన్ననాటి దోస్తులకు ఫాంహౌస్ విందు
By: Tupaki Desk | 12 Jan 2016 5:28 AM GMTఒక్కో రాజకీయ నాయకుడి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కాకుంటే అత్యున్నత స్థానాలకు చేరుకునే అధినేత తీరు నాటకీయంగా ఉండే వారి సంఖ్య చాలా తక్కువ. కాల్పనిక కథనాయకుడి తరహాలో వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో తెలుగోళ్ల మనసుల్లో చెరగని ముద్ర వేసిపోయారు ఎన్టీవోడు. ఆయన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. ఎవరూ కూడా తెలుగోళ్ల మనసుల్లో అంతగా ముద్ర వేయలేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే ఎన్టీవోడిని విపరీతంగా అభిమానించి.. ఆరాధించటమే కాదు.. తన కొడుకు పేరునే పెట్టేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు విలక్షణంగా ఉంటుంది. ఆయన మాటలు.. చేష్టలు నాటకీయంగా ఉంటాయి. విన్నప్పుడు కథలా అనిపించినా.. ఆయన చెప్పినవన్నీ నిజమయ్యే పరిస్థితులు చోటు చేసుకోవటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పుష్కరకాలం క్రితం చెప్పినోళ్లంతా జోకుగా తీసేశారు. నవ్వినోళ్లు చాలామందే. కేసీఆర్ ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువన్న మాట చెప్పినప్పుడు వింతగా.. విచిత్రంగా చూస్తూ.. రాజకీయ అవగాహన మరీ ఇంత తక్కువా? అన్నట్లు చూసినోళ్లు ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తనకు తగ్గట్లుగా మార్చేసుకోవటం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా దుబ్బాక వెళ్లి.. శిధిలమైన తాను చదువుకున్న స్కూలును రూ.5కోట్లతో అద్భుత భవనంగా మార్చాలని కేసీఆర్ నిర్ణయించటం.. శంకుస్థాపనకు వెళ్లిన ఆయన.. అప్పటికప్పుడు స్పందించి చెప్పిన మాటలు విన్నప్పుడు కేసీఆర్ లో నాటకీయత ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇదేదో కేసీఆర్ మాయ చేస్తున్నారని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. నాటకీయత పండించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి.
ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 20 నెలలు అయ్యాక.. తాను చదువుకున్న స్కూల్ భవంతిపై ఫోకస్ చేసిన ఆయన.. ఆ సందర్భంగా ఆ గ్రామంలో తన చిన్ననాటి స్నేహితుల్ని చూసిన వెంటనే.. పాత కేసీఆర్ అయిపోయారు. వారితో కులాసాగా మాట్లాడారు. కబుర్లు చెప్పారు. తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన.. తన స్నేహితులందరిని ఫాంహౌస్ కి రావాలని ఆహ్వానించేశారు. ఒక రోజు పెట్టుకొని మాంచిగా భోజనం చేసి.. కష్టసుఖాలు చెప్పుకుందామనేశారు.
తన చిన్ననాటి స్నేహితుల పేర్లను సైతం మర్చిపోని ఆయన.. చుట్టూ ఉన్నోళ్లు ఆశ్చర్యపోయేలా.. ‘‘ఆరేయ్ వెంకటేశం మన దోస్తులందరిని ఫామ్ హౌస్ తీసుకురారా. అందరం కలిసి సమావేశం అవుదాం. నాయి.. మీయి సాధకబాధకాలు చెప్పుకుందాం’’ అంటూ చెప్పేయటం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. గంట సేపు సాగిన తన పాత మిత్రుల సమావేశంలో.. అందరిని పేరు పేరునా పలుకరించి.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న తీరు చూస్తే.. ఇలాంటి కథానాయకుడు మరొకరు రావటం కష్టమనిపించక మానదు. ఏళ్లకు ఏళ్లు గడిచిన తర్వాత అంతమంది పేర్లు గుర్తు పెట్టుకొని మరీ పలుకరించటం లాంటివి కేసీఆర్ లాంటి వారికి మాత్రమే సాధ్యమేమో..?