Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ఫెడ‌రల్ ఫ్రంట్‌..మ‌రిన్ని వివ‌రాల‌తో వ‌స్తా

By:  Tupaki Desk   |   24 Dec 2018 12:55 PM GMT
కేసీఆర్‌ ఫెడ‌రల్ ఫ్రంట్‌..మ‌రిన్ని వివ‌రాల‌తో వ‌స్తా
X
రాజ‌కీయాల్లో గుణాత్మక మార్పు ల‌క్ష్యంగా - ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఉద్దేశంతో రాష్ర్టాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన తెల‌గాణ సీఎం కేసీఆర్ మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రితో స‌మావేశం అయ్యారు. కోల్‌ క‌తాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న కేసీఆర్ కు మమతా బెనర్జీ ఘనస్వాగతం పలికారు. మమతతో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మమతాబెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఫెడరర్ ఫ్రంట్ ఏర్పాటుపై నిన్నటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయని - ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం వెల్లడించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి..బలోపేతం కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ సమావేశం అనంతరం కోల్ కతాలోని కాళీమాత ఆలయాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరనున్నారు.

కాగా, రేపట్నుంచి రెండు - మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోని మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27న ప్రధాని మోదీని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి - యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించనున్నారు.