Begin typing your search above and press return to search.
తొందరపడొద్దు.. ఇప్పుడే ఎలాంటి ఫ్రంట్ లేదు
By: Tupaki Desk | 5 March 2022 4:40 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కాషాయ దళానికి వ్యతిరేకంగా కలిసొచ్చే నాయకులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ఆయన భేటీ అయ్యారు. రాంచీలోని సోరెన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు.. బీజేపీపై పోరాటం గురించి వాళ్లు చర్చించినట్లు తెలిసింది. అయితే జాతీయ రాజకీయాల్లో బీజేపీకి కానీ లేదా కాంగ్రెస్‌కు కానీ వ్యతిరేకంగా ఇంకా ఎలాంటి ఫ్రంట్ ఖరారు కాలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేసీఆర్ హడావుడి చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడంతో పాటు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందనే కారణంతో మళ్లీ మోడీని కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి మరింత పక్కా ప్రణాళికతో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే దిశగా సాగుతున్నారు.
కానీ ఇంకా ఎలాంటి ఫ్రంట్ ఖరారు కాలేదని, ఇప్పుడే తొందరపడి ఏ పేరూ పెట్టవద్దని కేసీఆర్ తాజాగా పేర్కొన్నారు. కానీ రాజకీయంగా మాత్రం కొత్త పొత్తులకు తెర తీస్తామని దేశాన్ని మెరుగ్గా తీర్చిదిద్దాలనేదే తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
"భారత్ సరైన దిశలో సాగాల్సిన అవసరం ఉంది. సమూలమైన మార్పు రావాలి. అందుకే వివిధ రాష్ట్రాల నేతలతో చర్చలు జరుపుతున్నా. కానీ ఇప్పుడే బీజేపీ వ్యతిరేక లేదా కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడలేదు. మూడో లేదా నాలుగో ఫ్రంట్ అని చెబుతున్నట్లు ఇంకా ఏది ఖరారు కాలేదు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా ప్రజల జీవితాలు మారలేదు. అభివృద్ధి ఫలాలు ఇంకా వాళ్లకు అందడం లేదు.
అందుకే దేశంలో కొత్త రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలను రాబోయే రోజుల్లో నిర్ణయిస్తాం. దానికి తొందర లేదు. అందుకే ఇప్పుడే మూడో ఫ్రంట్ అంటూ ఎలాంటి పేరు పెట్టకూడదని మీడియాను కోరుతున్నా" అని కేసీఆర్ తెలిపారు.