Begin typing your search above and press return to search.

యాదాద్రికి ఒక అవకాశం మిస్ చేసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   19 March 2022 10:34 AM GMT
యాదాద్రికి ఒక అవకాశం మిస్ చేసిన కేసీఆర్!
X
తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యం పునఃప్రారంభోత్స‌వానికి రంగం సిద్ధ‌మైంది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి యాదాద్రి ఆల‌య పునఃనిర్మాణంపై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఎంతో గొప్ప‌గా ఈ ఆల‌యాన్ని పునఃనిర్మించారు. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను జోడించారు.

ఈ నెల 21 నుంచి 28 వ‌ర‌కూ ఆల‌య ఉద్ఘాట‌న ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 28న జ‌రిగే మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ‌కు కేసీఆర్ హాజ‌రవుతారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా ఆల‌యాన్ని పునఃనిర్మించిన కేసీఆర్ ప్ర‌భుత్వం.. దానికి వ‌చ్చే గుర్తింపును అడ్డుకుంటుందా? కేసీఆర్ ఈగోనే అందుకు కార‌ణ‌మా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అంగ‌రంగ వైభవంగా జ‌రిగే యాదాద్రి ఆల‌య పునః ప్రారంభానికి ప్ర‌ధాని మోడీని కేసీఆర్ ఆహ్వానిస్తార‌ని మొద‌ట ప్రచారం జ‌రిగింది. గ‌తంలో ఢిల్లీ వెళ్లి ప్ర‌ధానిని క‌లిసిన కేసీఆర్.. అప్పుడు ఆల‌య ఆరంభోత్స‌వానికి రావాల‌ని మోడీని కోరారు కూడా. కానీ ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఇప్పుడు మోడీకి అధికారికంగా ఆహ్వానం అంద‌లేదు.

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. మోడీని కావాల‌నే పిల‌వ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒక్క‌సారి రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెడితే మోడీ రావ‌డం వ‌ల్ల కేసీఆర్‌కే ఎక్కువ ప్ర‌యోజ‌నం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్రధాని రావడం వల్ల కొత్తగా నిర్మించిన గుడికి జాతీయ మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తుంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఈ పుణ్యక్షేత్రం పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఎంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో యాదాద్రి ఆల‌యాన్ని గొప్ప‌గా పునఃనిర్మించారు. ఒక‌వేళ ఈ ఆల‌య పునః ప్రారంభోత్స‌వానికి మోడీ వ‌స్తే అప్పుడు ఈ ఆల‌య నిర్మాణం గురించి గొప్ప‌గా చెప్పుకునేందుకు కేసీఆర్‌కు అవ‌కాశం ఉండేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మోడీ వ‌స్తే జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలోనూ యాదాద్రికి గుర్తింపు ద‌క్కేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. ఆల‌య ప్రారంభోత్స‌వానికి మోడీని పిలిచార‌నే పేరు కేసీఆర్‌కు వ‌చ్చేది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఈగో వ‌ల్ల యాదాద్రికి జాతీయ స్థాయిలో ద‌క్కాల్సిన గుర్తింపు ద‌క్క‌కుండా పోతుంద‌నే విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయాల‌ను దేవుళ్ల‌కు ముడి పెట్టి చూడ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని చెబుతున్నారు. మోడీని పిల‌వ‌క‌పోవ‌డం కేసీఆర్ చేసిన పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. ఆల‌య అభివృద్ధి ఎలా జ‌రిగింద‌నే విష‌యం బ‌య‌ట‌కు తెలీద‌ని, దానికి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌ద‌ని అంటున్నారు.