Begin typing your search above and press return to search.

కేసీయార్ పార్టీ... టీడీపీలో హడావుడి...

By:  Tupaki Desk   |   3 Oct 2022 11:30 PM GMT
కేసీయార్ పార్టీ... టీడీపీలో హడావుడి...
X
ఆయన ఒకనాడు టీడీపీలో కీలక నాయకుడిగా మెలిగిన వారే. చంద్రబాబుకు నీడగా నిలిచిన వారే. అంతవరకూ ఎందుకు 1995 ఆగస్టులో ఎన్టీయార్ వెన్నుపోటు తరువాత చంద్రబాబు సీఎం కావడానికి ఆయన తన వంతుగా కృషి చేశారు అన్నది అప్పటి ప్రచారంలో ఉన్న మాట. ఇక 1983లో పార్టీలో చేరిన ఆయన 2000 వరకూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. అంటే ఆయనది సుదీర్ఘమైన 17 ఏళ్ళ పసుపు బంధం అన్న మాట.

ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన ఈ రోజు దాకా తెలంగాణా ముఖ్యమంత్రి. తెలంగాణాకే పరిమితం అయిన టీయారెస్ కి అధినేత. అయితే ఈ దసరా నుంచి కధ వేరే లెవెల్ లో ఉంటుంది అని టీయారెస్ వర్గాలే చెబుతున్నాయి. దాన్ని బట్టి చూస్తే కేసీయార్ పొరుగు రాష్ట్రాలను టార్గెట్ చేశారని అంటున్నారు.

అందునా తన రాజకీయ ఉనికికి, ఇంతటి ఎదుగుదలకు కారణమైన టీడీపీనే ఆయన టార్గెట్ చేశారని చెబుతున్నారు. ఏపీలో తన పార్టీ వెళ్ళూ కాళ్ళూ ఊనుకోవాలంటే ఆపరేషన్ టీడీపీ అనడమే బెటర్ అని కేసీయార్ ఆలోచిస్తున్నారుట. ఏపీలో కేసీయార్ కి ఇటు పార్టీ పరంగా చూస్తే టీడీపీలో ఉన్న ఎంతో మంది కీలక నాయకుల‌తో అనుబంధం ఉంది.

అదే తీరున ఆయన కులం ఫ్యాక్టర్ ని కూడా తీసి ఏపీలో గురి పెట్టబోతునారు. ఏపీలో కొప్పుల, వెలమ సామాజికవర్గం నేతలతో కేసీయార్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయని అంటున్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరంలలో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. లాగే రాయలసీమలో కడపలో కూడా ఉన్నారు. దాంతో కేసీయార్ వీరి మీద గురి పెట్టారు అని తెలుస్తోంది.

అదే విధంగా తమ పాత పరిచయాలను కూడా వాడుకుంటూ అక్కడ ఉన్న చాలా పార్టీల మీద ఆయన టార్గెట్ పెట్టారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ లో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. వారు సరైన వేదిక లేక ఎదురుచూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో ఈ మధ్యనే కేసీయార్ చర్చలు జరిపారు అని చెబుతున్నారు.

మొత్తానికి ఏపీలో కేసీయార్ ముందు టీడీపీని గురి పెట్టినా మెల్లగా అధికార వైసీపీతో పాటు అనేక పార్టీలలో ఉన్న కీలక నేతలకు అసమ్మతి నాయకులకు గేలం వేస్తారని అంటున్నారు. దీని బట్టి చూస్తే పక్కా ప్లాన్ తోనే గులాబీ బాస్ జాతీయ రాజకీయ ప్రయాణం సాగుతోంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.