Begin typing your search above and press return to search.
జాతీయ పార్టీ కోరిక.. కేసీఆర్ లో తెలంగాణ ఆత్మను చంపేస్తుందా?
By: Tupaki Desk | 5 Oct 2022 5:12 AM GMTఒకటి తర్వాత రెండు.. దాని తర్వాత మూడు.. నాలుగు అంటూ ముందుకెళ్లటం లెక్కల్లో బాగుంటుంది. కానీ.. రాజకీయ పరిమితుల్ని అసరాగా చేసుకొని అడుగులు వేసే వారికి అంతగా నప్పదు. ఆ విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ గుర్తించారా? అన్నది ప్రశ్న. తాను చేసే ప్రతి పని గురించి సుదీర్ఘంగా మధించటం.. దాని కోసం భారీ కసరత్తు చేయటం.. పక్కా వ్యూహం నిర్మించటం లాంటి లక్షణాలు కేసీఆర్ లో కోరుకున్న దాని కంటే ఎక్కువగానే కనిపిస్తాయి. అయినప్పటికీ.. ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరిస్తానని చెబుతున్న మాటలు ఇప్పుడు కొత్త ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి.
జాతీయ పార్టీ ఏర్పాటు వేళ.. కేసీఆర్ కు ఉన్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. అధికారం.. కోరుకున్నంత డబ్బు.. రాజకీయాల్ని శాసించేందుకు అవసరమైన తెలివి ముడిసరుకులుగా ఉన్నప్పుడు.. తాము కోరుకున్న కమ్మటి వంటను వండేయొచ్చని అనుకోవటం అందరూ చేసే పనే. కానీ.. వంటకు అన్ని ఎంత అవసరమో.. కారం.. ఉప్పు లాంటివి మరింత కీలకమని.. అవే కూర ఎలా ఉందన్న విషయాన్ని తేల్చేస్తాయన్న చిన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇంతకాలం తెలంగాణ ప్రయోజనాలు.. తెలంగాణ ఆత్మగౌరవం లాంటి ఉప్పు.. కారాల్ని తెలంగాణ ప్రజలకు రుచి చూపించిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంలో అధికారమే లక్ష్యమైన వేళ.. ఆయన అమ్ముల పొదిలో ఉండే ఆయుధాల మాటేంటి? తెలంగాణను టార్గెట్ చేసే వారిని చీల్చి చెండాడే భావోద్వేగ అస్త్రాలు.. కేసీఆర్ కు శాపంగా మారనున్నాయా? అన్నది మరో ప్రశ్న. తెలంగాణ సెంటిమెంట్ ను తరచూ సంధించే గులాబీ బాస్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల పేరుతో చేస్తున్న రాజకీయం ఆయన తనకు తెలీకుండా తనే పరిమితుల్ని గీసుకుంటున్నారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ కున్న ఆసక్తి.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇకపై.. తెలంగాణపై గతంలో మాదిరి ఆయన తన వాదనను వినిపించే అవకాశం లేదంటున్నారు. ఇంతకాలం ఆంద్రా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్న ఆయన.. జాతీయ రాజకీయ నేత హోదాలో తెలంగాణ ప్రయోజనాల్ని మాత్రమే కాదు.. ఏపీ ప్రయోజనాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది.
ఈ విషయంలో ఏ మాత్రం బ్యాలెన్సు తప్పినా.. మొదటికే మోసం వస్తుంది. ఆ విషయాన్ని ఆయన గుర్తించారా? అన్నది ప్రశ్న. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలన్న ఆయన కోరిక తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఏమైనా..కేసీఆర్ జాతీయ రాజకీయాల కారణంగా తొలుత దెబ్బ పడేది తెలంగాణకు.. తెలంగాణ ప్రయోజనాలకే అన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. కేసీఆర్ జాతీయ పార్టీ మోజు ఏమో కానీ.. తెలంగాణ ప్రయోజనాల్ని బలి పెట్టేలా ఆయన తీరు ఉందన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. మరి.. దీనికి ఆయన ఇచ్చే సమాధానం ఏమిటో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.