Begin typing your search above and press return to search.
నెహ్రూని ఎదిరించిన దక్షిణాది...కేసీయార్ మోడీ మీద నెగ్గాలంటే...?
By: Tupaki Desk | 2 Sep 2022 5:30 PM GMTదక్షిణాది ఉత్తరాది అన్న భేదాలు దేశానికి స్వాతంత్రం లభించిన తొలి నాళ్ళలోనే ఉన్నాయని అనుకోవాలి. లేకపోతే నెహ్రూతో మొదట్లో ఎంతో సాన్నిహిత్యం నెరిపిన రాజాజీ అనబడే చక్రవర్తుల రాజగోపాలాచారి తరువాత రోజులలో నెహ్రూకే ప్రత్యర్ధి కావడం రాజకీయ విచిత్రంగానే చూడాలి. రెండు సార్లు మద్రాస్ రాష్ట్ర సీఎం గా పనిచేసిన రాజాజీ ఈ దేశానికి చివరి గవర్నర్ జనరల్ గా కూడా పనిచేశారు.
అంతటి రాజాజీకి నెహ్రూ ఏలుబడిలో కాంగ్రెస్ లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పెత్తందారీ విధానం అన్నీ ఒకేసారి కనిపించాయి. ఆ రుగ్మతలను పూర్తిగా నిర్మూలించడానికి రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆనాడు జమీందార్లు, రాజులు, మేధావులు, ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. అలాగే దేశంలోని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వారు, ఇతర పార్టీలలో ఉన్న వారు అయిన ఫ్రొఫెసర్ ఎన్.జి రంగా, ఖాసా సుబ్బారావు, మినూ మసాని, బీఆర్ షెనాయ్, పిలూ మోదీ, ఏడీ ష్రాఫ్ వంటి వారు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీకి అన్నీ తామై జనంలోకి తీసుకువెళ్ళారు.
ఇక ఆ పార్టీకి ఎన్‌జీ రంగా, ఖాసా సుబ్బారావు తెలుగువారుగా ఊపిరులూదారు. ఎన్‌జీ రంగా అయితే ఏకంగా పదేళ్ళ పాటు స్వతంత్ర పార్టీకి నాయకత్వం వహించారు. ఇక స్వతంత్ర పార్టీ నాడు కాంగ్రెస్ కి ధీటుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదరణ అందుకుంది. 1962లో ఎన్నికలు జరిగితే 192 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి 22 మందిని గెలిపించుకున్న పార్టీగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే నాడు ఆ పార్టీకి 8.5 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక నాడు దేశంలో వివిధ రాష్ట్రలా శాసనసభలలో కూడా స్వతంత్ర పార్టీకి 207 ఎమ్మెల్యేలు ఉండేవారు. నాడు బలంగా ఉన్న కమ్యూనిస్టుల కంటే కూడా ఈ సంఖ్య పెద్దది. ఇక 1967 ఎన్నికల నాటికి స్వతంత్ర పార్టీ తన బలాన్ని లోక్ సభలో 44కి పెంచుకుని ఓట్ల శాతం 9.6 శాతానికి పైగా సాధించింది. 1971 నాటికి మాత్రం ఆ పార్టీ పతనం మొదలైంది. ఆ తరువాత రాజజీ కూడా మరణించారు. అదంతా పక్కన పెడితే నెహ్రూని ఆయన కాంగ్రెస్ ని 1959లోనే పార్టీ పెట్టి ఎదిరించిన మొనగాడుగా దక్షిణాదిన రాజాజీ చరిత్రలో నిలిచారు.
మరి ఆయన బలం ఏంటి, ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అన్నది ఈ రోజున కేసీయార్ లాంటి మరో దక్షిణాత్యునికి ఈ రొజు చాలా అవసరం. నాడు నెహ్రూ మాదిరిగానే నేడు మోడీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బలంగా ఉన్నారు. ఆయన ఇమేజ్ అంతకంతకు పెరుగుతోంది. మరో వైపు కాంగ్రెస్ తగ్గిపోతూ ఉంటే ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంటోంది. ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీలు కూడా గత మూడు దశాబ్దాలుగా దేశంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఇలా దేశ రాజకీయ ముఖ చిత్రం ఉన్నపుడు కేసీయార్ లాంటి వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. నాడు నెహ్రూ ఏలుబడిలో అవినీతి, పెత్తందారీ పోకడలను రాజాజీ జనసమాన్యంలో పెట్టి రాజాజీ గట్టిగా ఎండగట్టగలిగారు. మరి మోడీ విషయంలో కూడా కేసీయార్ అలాగే చేయాలంటే పదునైన వ్యూహాలు అవసరం. ఫెడరల్ ఫ్రంట్ అని 2018 ఎన్నికల వేళ కలవరించిన కేసీయార్ ఆ తరువాత ఆ ఊసే మానుకున్నారు.
ఇపుడు జాతీయ పార్టీ అంటున్నారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. కాంగ్రెస్ జాతీయ పార్టీగా పేరుకు కనిపిస్తోంది. వామపక్షాలు ఇతర జాతీయ పార్టీలు కూడా తగ్గిపోతున్న నేపధ్యంలో కొత్తగా జాతీయ పార్టీ పెట్టి కేసీయార్ ఏమి సాధిస్తారు అన్నది కూడా చూడాలి. పైగా ప్రాంతీయ పార్టీలు తమ అస్థిత్వాన్ని వదులుకుని జాతీయ పార్టీలో చేరే సీన్ ఉండదు. అందువల్ల ఇది టఫ్ జాబ్ లాగానే ఉంది.
అలాగని కాడె వదిలేది కాకుండా కేసీయార్ తన పట్టుదలతోనే ముందుకు వెళ్ళాలి. దానికి ఆయన చేయాల్సింది ఫెడరల్ ఫ్రంట్ అని మళ్ళీ ముందు పెట్టుకుని సాగడమే. అందులో అన్ని ప్రాంతీయ పార్టీలను చేర్చుకుని జాతీయ పార్టీలలో కాంగ్రెస్ ని ఎదిరించే వారిని అక్కున చేర్చుకోవాలి. ఈ విషయంలో తాను ఒక్కడే కాకుండా అందరినీ కలుపుకుని పోవాలి. పైగా తాము దేశం కోసం చేస్తున్నామని పదవుల కోసం కాదని జనాలకు నమ్మకం కలిగేలా చేసుకోవాలి. ఆ పని రాజాజీ చేయగలిగారు. ఆయన పార్టీ పదవులు తీసుకోలేదు. కేసీయార్ అలా ఉండగలరా.
మోడీ మీద వ్యతిరేకత వేరు, దాన్ని మెటీరియలైజ్ చేసి అందరినీ ఒకే తాటి మీదకు తేవడం వేరు. ఇక్కడ ఏ స్వార్ధమూ లేదని పరమార్ధం మాత్రమే ఉందని జనాలనే కాదు రాజకీయ జనాలను కూడా ఒప్పించగలిగితేనే కేసీయార్ మోడీ మీద చేసే యుద్ధంలో విజయం సాధించగలరు. దానికి రాజాజీ లాంటి వారు చేసిన పోరాటం స్పూర్తిగా కేసీయార్ తీసుకోవాల్సి ఉంటుంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.