Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు దగ్గరవుతున్న కేసీఆర్‌ కుటుంబం

By:  Tupaki Desk   |   26 May 2015 5:01 AM GMT
కాంగ్రెస్‌ కు దగ్గరవుతున్న కేసీఆర్‌ కుటుంబం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆయనతో విభేదిస్తున్నారా? తెలంగాణ కల సాకారం అయ్యేందుకు కారణం అయిన కాంగ్రెస్‌ కు వారు మద్దతిస్తున్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కేసీఆర్‌ మేనల్లుడు సీహెచ్‌ ఉమేశ్‌రావు ఢిల్లీలో కలిశారు. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఉమేశ్‌ రావు దాదాపుగా ఏడాదికాలంగా స్తబ్దుగా ఉన్నారు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లి మరి రాహుల్‌ కలవడం ఆసక్తికరం.

రాహుల్‌ గాంధీని కలిసి అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర పార్టీ పరిస్థితులపై రాహుల్‌కు వివరించానని తెలిపారు. ఎన్నికల హామీలను కేసీఆర్‌ పూర్తిగా తుంగలో తొక్కారని, ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. ఏడాదిలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వానికి వేయనన్ని మొట్టికాయలు ఈ ప్రభుత్వానికి హైకోర్టు వేసిందని, ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం వాస్తవాలు గ్రహించాలన్నారు. ఓయూ భూముల్లో కాకుండా ఇతరప్రాంతాల్లో పేదలకు ఇళ్ళు కట్టించాలన్నారు. వర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోబోమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు అడ్డగోలు నిర్ణయాలను కాంగ్రెస్‌ తరఫున ఎదురిస్తామని చెప్పారు.


కేసీఆర్‌ అన్న కూతురు రేగులపాటి రమ్య కొద్దికాలం క్రితం కాంగ్రెస్‌ లో చేరారు. ఆమె సైతం పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. కేసీఆర్‌ వ్యవహారశైలిపై ఆమె సైతం గతంలో విమర్శలు చేయడం గమనారÛం. మొత్తంగా కేసీఆర్‌ ను విబేధిస్తూ ఆయన కుటుంబసభ్యులు కాంగ్రెస్‌ కు దగ్గర అవడం ఆసక్తికరంగా మారింది.