Begin typing your search above and press return to search.
కరోనాపై వ్యూహం మార్పు.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్
By: Tupaki Desk | 23 July 2020 7:00 AM GMTతెలంగాణలో కరోనా టెస్టులు చేయకుండా హైకోర్టు చీవాట్లతో తెలంగాణ సర్కార్ ఎంత అభాసుపాలు అయ్యిందో తెలిసిందే. సామాన్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేసీఆర్ సర్కార్ ఇక వ్యూహం మార్చేసింది. కొత్త యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతోంది.
హైకోర్టు సీరియస్ తో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టెస్టుల సంఖ్యను పెంచేసింది. రాష్ట్రంలో 7 లక్షల యాంటీజెన్ టెస్టులను నిర్వహించాలని నిర్ణయించింది.
తొలి దశలో 2 లక్షల యాంటిజెన్ టెస్టు కిట్స్ తెప్పించిన కేసీఆర్ సర్కార్ ఇప్పటికే వాటితో 65వేల టెస్టులు నిర్వహించింది. ఆ తర్వాత రెండో దశలో 3 లక్షల కిట్లు.. తాజాగా మరో 2 లక్షల కిట్లను తెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 7 లక్షల కిట్లతో రాష్ట్రవ్యాప్తంగా టెస్టులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పీహెచ్.సీలో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ఇప్పటివరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేవారు. దీనికి ఎక్కువ సమయం పట్టేది. ఫలితాలు 2 లేదా 3 రోజులకు వచ్చేవి. కానీ ఇప్పుడు వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించేందుకు యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కేవలం అరగంటలోనే ఫలితాలు వస్తాయి. వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం రోజుకు సగటున 13-14 వేల టెస్టులు చేస్తున్నారు.
యాంటీజెన్ టెస్టులు చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులకు కూడా అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. డేటాను ప్రభుత్వానికి ఆ ప్రైవేట్ ఆస్పత్రులు ఇవ్వాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 7 లక్షల యాంటీజెన్ కిట్లతో టెస్టులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడంతో జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశా కార్యకర్తలు, ఏఏఎన్ఎంలను ఆదేశించారు.
ఇన్నాళ్లు టెస్టులు చేయకుండా సతాయించిన తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు వ్యూహం మార్చుకొని పెద్ద ఎత్తున టెస్టులకు సిద్ధమైంది. రాబోయే రోజుల్లోనూ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది.