Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ కేసీఆర్ లో మార్పు తీసుకొచ్చిందా..?
By: Tupaki Desk | 27 Aug 2021 11:30 AM GMTతెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ వ్యవహార శైలి పూర్తిగా మారింది. గతంలో ఆయనను కలవాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు భయపడేవారు. ఎక్కువ శాతం ఫాం హౌస్‌లో ఉండే కేసీఆర్ కు ఇతరులతో ఎక్కువగా మాట్లాడడం ఇష్టముండేది కాదన్న విమర్శ ఉండేది. దీంతో చాలా మంది కేసీఆర్ ను కలవడానికి కష్టపడేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. రెగ్యులర్ గా టైంటూ టైం ప్రగతి భవన్ లో అందరినీ కలుస్తున్నాడు. ఎమ్మెల్యేలను కూడా కలుస్తున్నారు. కేసీఆర్ లోని ఈ మార్పును చూసి చాలా మంది అశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. ఎవరైనా చెబుతారు. అదే హూజూరాబాద్ ఉప ఎన్నిక అని...
టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటికొచ్చాక కేసీఆర్ లైట్ గా తీసుకున్నారు. ఎందుకంటే విపరీతమైన ప్రభుత్వ పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకు వెళ్తుందని ఆశించారు. కానీ కొన్ని రోజుల తరువాత సీన్ మారిపోయింది. ఈటలకు ఆటోమెటిక్ గా మద్దతు పెరిగింది. అప్పటికే కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రకటించినా వాటి ఫలాలు అందుకోని వారు ఎందరో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై వారంతా వ్యతిరేకతతో ఉన్నారు. దీనిని ఈటల రాజేందర్ బాగా పసిగట్టారు. కేసీఆర్ పై విమర్శలు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందని వారెందరో ఉన్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు.
కొన్ని రోజులుగా గమనిస్తే ఈటల విమర్శలు చేస్తున్న ప్రతీ దానిని కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉదాహరణకు వృద్ధాప్య పింఛన్లు రాని వారు ఎంతో మంది ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. దీంతో కేసీఆర్ వెంటనే 57 ఏళ్ల వయసు తగ్గించి పింఛన్ అమలు చేశారు. వాస్తవానికి దీనిని రెండు సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు దీనిపై కార్యచరణ ప్రారంభించలేదు. కానీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో కేసీఆర్ లో చలనం వచ్చింది. ఇక సీఎం పేషీలో ఒక్క దళిత అధికారి అన్నా ఉన్నాడా..? అని ఈటల ప్రశ్నించాడు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో జరిగిన సభలో తన పేషీలో రాహుల్ బోజ్జా ఉంటారని తెలిపారు.
ఇలా ప్రతీ విషయంలోనూ కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకే ఒక్క ఉప ఎన్నిక కేసీఆర్‌లో ఎంత మార్పు వచ్చిందోనని టీఆర్ఎస్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు. మరోవైపు దుబ్బాక లాంటి ఉప ఎన్నికలో కేసీఆర్ కనీస ప్రచారం చేయలేదు. అంతేకాకుండా ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోం అని ప్రకటించారు. కానీ అక్క బీజేపీ పాగా వేసింది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా లైట్ గా తీసుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో కూర్చున్నా చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.
దీంతో కేసీఆర్ దేనిని చిన్నగా అంచనా వేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే ఆ నియోజకవర్గంలో పర్యటించి ‘దళిత బంధు’ ను అమలు చేశాడు. నేడు కరీంనగర్లో పర్యటించారు. అయితే కరీంనగర్ లో ఓ టీఆర్ఎస్ నాయకుడి కూతురు వివాహానికి హాజరయ్యాడు. వాస్తవానికి ఆ టీఆర్ఎస్ నాయకుడు ద్వితీయ శ్రేణిలోనే ఉన్నాడు. కానీ కేసీఆర్ హాజరు కావాల్సి రావడం వెనుక తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతీ విషయంలో సీఎం అందుబాటులో ఉంటాడన్న భావన కలిగించేందుకే కేసీఆర్ తనలో మార్పు తీసుకొచ్చాడని అనుకుంటున్నారు.
అయితే మరో రెండేళ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్పటి వరకు ఇలాగే మూవ్ అవుతారా..? లేక హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత మళ్లీ ఫాం హౌస్ కు వెళుతారా అని చర్చించుకుంటున్నారు.