Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇందుకే నచ్చుతాడు బాస్
By: Tupaki Desk | 21 May 2016 6:32 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన రాజకీయనిర్ణయాధికారశైలికి ఇదో మచ్చుతునక. ఒకేరోజు రెండు విశేషమైననిర్ణయాలు తీసుకొని తన పరిపాలన ఎలా ఉంటుందోనిరూపించుకున్నారు. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల గురించి కాగా...మరొకటి ఉద్యమంలో ముందుండి నడిచిన ప్రభుత్వ ఉద్యోగుల గురించి.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకమంది అమరులైన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాతవారికి తగిన న్యాయం జరగలేదనే ఆరోపణలు కేసీఆర్ పై పెద్దఎత్తున్నే వినిపించాయి. అయితే దశలవారీగా వారిని గౌరవించేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పిన కేసీఆర్ తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలకు పెద్దఊరట ఇచ్చారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. వారి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొని ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్హతతో సంబంధం లేదని ముందుగా ఉద్యోగంలో చేరవచ్చునని...ఆతర్వాత ఐదేళ్లలో సదరు విద్యార్హతను పూర్తిచేసుకోవచ్చుననికూడా కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు.
ఇక మరో విషయానికి వస్తే భార్యభర్తలైన ఉద్యోగస్తులను ఓ వింతసమస్య వేధిస్తుంటుంది. భార్యకు ఒకచోట కొలువు అయితే భర్తకు మరోచోట ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వంలోని సవాలక్ష నిబంధనల కారణంగా వారిద్దరు ఒకే చోట పనిచేసే అవకాశాలుచాలా తక్కువ. అయితే దీనికి చెక్ పెట్టి ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. ఒకవేళ ఒకేచోట వీలుకాకపోయినా సమీప ప్రాంతాల్లో అయినా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఇచ్చేవారు. ఈ ఉత్తర్వులతో దాదాపు ఎనిమిది వేలమంది ఉద్యోగులకు లాభం జరగనుంది. కేసీఆర్ ఒకే రోజున తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు తెలంగాణ ఉద్యమకోణంలో చూసిన, సామాన్య ప్రజానికం దృష్టిలో అయిన మనసు గెలుచుకునేవేనని చెప్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే కొన్ని అంశాల్లో విబేధించినప్పటికీ కేసీఆర్ తీరును ప్రశంసించాలని అనిపిస్తుందని అంటున్నారు.