Begin typing your search above and press return to search.
సీఎం కొత్త ఇంటి గృహప్రవేశం డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 21 Nov 2016 7:03 AM GMTనమ్మకాలు మహా గొప్పవి. సామాన్యుడి నమ్మకాల్ని ఎవరూ పట్టించుకోరు కానీ.. అధికారం చేతిలో ఉన్న వారి నమ్మకాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. పవర్ లో ఉన్న వారు దేన్ని నమ్ముతారో అవి వెనువెంటనే జరిగిపోతుంటాయి. నమ్మకాలన్న మాట విన్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు రాక మానరు. ఆయన కానీ ఏదైనా విషయాన్ని నమ్మారంటే.. ఎంతమంది దాన్ని వ్యతిరేకించినా.. దాన్ని లక్ష్యపెట్టరు. తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగే వరకూ ఆ అంశాన్ని వదిలి పెట్టరు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నివాసం కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి మరీ బేగంపేటలో భారీ భవనాన్ని నిర్మించారు. కానీ.. వాస్తు లెక్కలో ఏదో తేడా ఉందన్న ప్రచారంతో పాటు.. పలువురు వాస్తు సిద్ధాంతులు సదరు నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆ ఇంటిని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీలయ్యారు.
పవర్ లోకి వచ్చిన తర్వాత.. కొద్ది కాలం పాటు.. ఇప్పుడున్న ఇంట్లోకి రావటానికి ఆయన అస్సలు ఇష్టపడలేదు. పలు ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోవటంతో.. కొన్ని మార్పులు చేర్పులు చేసి.. తాత్కాలిక నివాసం కోసం ఆయన ఇంట్లో చేరారు. అప్పటికి తృప్తి కలగని ఆయన.. యుద్ధప్రాతిపదికన కొత్త ఇంటి అన్వేషణ షురూ చేశారు.
చివరకు ఐఏఎస్ ల క్వార్టర్లను కూలగొట్టి మరీ.. తాను కోరుకున్న రీతిలో ముఖ్యమంత్రి అధికార నివాస గృహానికి ప్లాన్ చేశారు. తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని పూర్తి చేయించారు. ముఖ్యమంత్రి వారు స్వయంగా ఉండబోయే ఇళ్లు కావటంతో బడ్జెట్ కు పెద్దగా పరిమితులు పెట్టుకోకుండా.. విశాలంగా.. భారీతనం ఏ మాత్రం మిస్ కాకుండా ఇంటి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ మధ్యన దసరాకే ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని అనుకున్నా.. ఫినిషింగ్ టచ్ లు మిగిలిపోవటంతో.. గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా.. ఇంటి పనులు దాదాపుపూర్తి అయిన నేపథ్యంలో ఇంటి గృహప్రవేశానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఈ నెల24న.. అంటే.. గురువారం ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి గృహప్రవేశ ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. గురువారం తెల్లవారుజాము ప్రాంతంలో గృహప్రవేశ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. మరి.. సీఎంవారి అధికారిక నివాసం గృహప్రవేశ మహోత్సవం ఎంత భారీగా సాగుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/