Begin typing your search above and press return to search.
తెలుగు స్టేట్స్ : పాన్ ఇండియా మూవీస్ వర్సెస్ పాన్ ఇండియా పాలిటిక్స్
By: Tupaki Desk | 21 Feb 2022 9:30 AM GMTఇపుడు జోరు అంతా పాన్ ఇండియా లెవెల్ లోనే. అది సినిమా అయినా రాజకీయమైనా తెలుగు జెండా ఉత్తరాదిన ఎగరాల్సిందే. అంటే నార్త్ ఇపుడు సౌత్ వైపు చూస్తోంది అన్న మాట. గత దశాబ్దం వరకూ సినిమా అంటే బాలీవుడ్ నుంచే వస్తేనే ఆల్ ఇండియా లెవెల్ అప్పీల్ ఉంటుంది అన్న బ్రాండ్ ఉండేది. ఎపుడైతే బాహుబలి రిలీజ్ అయిందో దాన్ని పూర్తిగా చెరిపేసినట్లు అయింది. సౌత్ నుంచి అందునా తెలుగు నుంచి వచ్చిన బాహుబలికి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. అది లగాయితూ నార్త్ అటెన్షన్ మొత్తం సౌత్ వైపు మళ్ళింది.
ఇక్కడ తీసే సినిమా కోసం బాలీవుడ్ ఆసక్తిగా చూడడమే కాదు విపరీతంగా ఆదరిస్తోంది కూడా దానికి లేటెస్ట్ ఉదాహరణ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ. ఇది బాలీవుడ్ లో కలెక్షన్ల పంట పండించింది. అలాగే ప్రభాస్ సాహో టాలీవుడ్ లో ఫట్ అయితే బాలీవుడ్ లో హిట్. దాంతో ఇపుడు వరసబెట్టి పాన్ ఇండియా మూవీస్ వంట టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది.
టాప్ హీరోలు అంతా కూడా పాన్ ఇండియా ఫీవర్ తోనే మునిగితేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మొదలుపెడితే యంగర్ జనరేషన్ దాకా అంతా ఆల్ ఇండియా లెవెల్ మూవీ తమదేనని జబ్బలు చరుస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఖాన్స్ త్రయాన్ని కూడా బీటౌట్ చేసి బీ టౌన్ లో పాన్ ఇండియా మూవీగా తెలుగు సినిమా సింహాసనం ఆక్రమించుకుంది. సరే సినిమాల సంగతి ఇలా ఉంటే రాజకీయాల తీరు అలాగే ఉంది.
ఒకపుడు ఉత్తరాది వాళ్ళే ప్రధానులు కావాలీ అన్న సెంటిమెంట్ ఏదో ఉండేది. కానీ ఇపుడు సీన్ నెమ్మదిగా మారుతోంది. సౌత్ వైపు చూడు, పాలిటిక్స్ అక్కడే నేడూ అంటోంది దక్షిణాది రాజకీయం. ఆ విధంగా ఆలోచిస్తే ఇపుడు పాన్ ఇండియా పాలిటిక్స్ కి మంచి రోజులే వచ్చేట్లుగా కనిపిస్తోంది. ఎపుడూ హిందీ మాట్లాడేవారే ప్రధానులుగా ఎందుకు ఉండాలి, తెలుగు మాట్లాడే వారు ప్రధాని అయితే తప్పేంటి అన్న చర్చ కూడా వస్తోంది.
గతంలో ఎన్టీయార్, చంద్రబాబు పాన్ ఇండియా లెవెల్ పాలిటిక్స్ చేసినా ఆనాడు కాలం కలసి రాలేదు, కానీ ఇపుడు మాత్రం అలా కాదు, నార్త్ నుంచి సౌత్ కి బిగ్ ఇన్విటేషన్ వస్తోంది. మీరు ముందుకు రండి అని పిలుస్తున్నారు. ఆ పిలుపును అందుకుని కేసీయార్ ఢిల్లీ వెళ్తున్నారు. కలసి వచ్చే పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో యాంటీ బీజేపీ ఫ్రంట్ కి కూడగట్టడానికి ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అంటే నేనున్నాను అని కేసీయార్ రెడీ అవడమే పాన్ ఇండియా పాలిటిక్స్ కి కలసివచ్చే అతి పెద్ద ఇంధనంగా చెబుతున్నారు.
మమతా బెనర్జీకి, అరవింద్ కేజ్రీవాల్ కి మధ్య తెలియని వార్ ఉంది. ఇక ఇద్దరికీ ప్లస్ ల కంటే మైనస్సులు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన లాలూ, ములాయం సింగ్ యాదవ్ లు ఇపుడు వయోభారంతో పక్కకు తప్పుకున్నారు. మరో సీనియర్ మరాఠా యోధుడు శరద్ పవార్ వంటి వారు కూడా వయసు ప్రభావానికి లోను అయి ఉన్నారు.
కాంగ్రెస్ లో చూసుకుంటే భావి వారసుల మీద భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇపుడు ఉత్తరాదిన చెప్పుకోదగిన నాయకత్వం గట్టిగా లేదు అనే బాధ ఉంది. ఆ లోటుని భర్తీ చేయడానికి సౌత్ నుంచి తెలుగు నుంచి కేసీయార్ ముందుకు దూసుకువస్తున్నారు అన్న చర్చ ఉంది. కేసీయార్ పట్టువదలని నేత అని చెబుతారు. ఆయన తలచుకుంటే సాధించడానికి వెనుకాడరు అని కూడా అంటారు.
అలాంటి కేసీయార్ ఇటు ప్రాంతీయ పార్టీల నేతలతో ముచ్చట్లు పెడుతూనే అటు కాంగ్రెస్ శిబిరానికీ సానుకూల సంకేతాలు పంపుతున్నారు. అన్నీ కలసి వస్తే మాత్రం ఎన్నికల కంటే ముందే యాంటీ బీజేపీ ఫ్రంట్ పురుడు పోసుకోవడం ఖాయమే. ఈ పాన్ ఇండియా లెవెల్ పాలిటిక్స్ కి సౌత్ నుంచి కావాల్సినంతగా బలాన్ని ఇచ్చేందుకు తమిళనాడు, ఆంధా, కేరళ కూడా సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పాన్ ఇండియా యుగం ఇది. తెలుగు నుంచి దూసుకొచ్చే ప్రతీ బాణం నార్త్ లో లక్ష్యాన్ని చేరుతోంది. ఇపుడు కేసీయార్ పాన్ ఇండియా పొలిటికల్ వంటకం కూడా సూపర్ హిట్ అయ్యే చాన్స్ అయితే ఎక్కువగానే ఉంది అంటున్నారు.