Begin typing your search above and press return to search.
వరాల వర్షం: తాజాగా తోఫా రూ.1099
By: Tupaki Desk | 31 Dec 2015 9:17 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాంచి జోరు మీదున్నారు. నిన్న మొన్నటివరకూ యాగాలు.. పూజలు.. విందులతో బిజీబిజీగా ఉన్న ఆయన ఒక్కసారిగా పాలన మీద ఫోకస్ చేశారు. కొత్త సంవత్సరం వేళ.. ఏ క్షణంలో అయినా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ.. గంటల వ్యవధిలో ఆయన వరాల జల్లు కురిపించేస్తున్నారు.
కొత్త ఉద్యోగాల తీపి కబురు వచ్చిన కాసేపటికే.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపేసి కేసీఆర్ సర్కారు.. దాదాపు 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన కీలక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి జీవులంతా పండగ చేసుకునేలా వరాన్ని ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని ఇళ్ల యజమానుల వార్షిక ఇంటిపన్ను కానీ రూ.1200 లోపు అయితే.. ఆ ఇళ్ల యజమానులు ఇకపై రూ.101 మాత్రమే పన్నుకడితే సరిపోయేలా నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టటానికి కొన్ని గంటల ముందే తాజా తోఫా ప్రకటించిన ఆయన.. ఆలస్యం చేయకుండా అందుకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా.. జీహెచ్ ఎంసీ చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగిన అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రోజుకో వరాన్ని ప్రకటించి చంద్రబాబు వరాల నేతగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కంటే మిన్నగా కేసీఆర్.. గంటల వ్యవధిలో వరాల మీద వరాలు ప్రకటించటమే కాదు.. అందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారని చెప్పక తప్పదు.