Begin typing your search above and press return to search.
నేడు ఎమ్మెల్సీగా కవిత నామినేషన్.. మంత్రి పదవికి ఖాయమేనా?
By: Tupaki Desk | 18 March 2020 5:01 AM GMTమాజీ ఎంపీ , సీఎం కేసీఆర్ తనయ అయిన కల్వకుంట్ల కవిత .. ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే, ఆ తరువాత జరిగిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందటంతో ఆమె రాజకీయ భవిష్యత్ పై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత కవిత పెద్దగా బయటకి కూడా రాలేదు. పార్టీ కార్యక్రమాలకి కూడా హాజరుకాలేదు. దీంతో కవిత ఇక రాజకీయాలకి గుడ్ బై చేపినట్టేనా అనే అనుమానం అందరిలో మొదలైంది. ఇక ఈ మద్యే రాజ్యసభ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుండి కవిత పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ ..ఆమెకి రాజ్యసభ టికెట్ కూడా దక్కలేదు. దీనితో ఇక కవిత ఇంటికే పరిమితం కాబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.
అయితే, తాజాగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు సిద్ధమైయ్యారు అని తెలుస్తుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వెయ్యబోతున్నారు. ఈ రోజు (18 మార్చి 2020) ఉతయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండగా.. చివరి నిముషంలో సీఎం కేసీఆర్ కవితకి ఎమ్మెల్సీ ఖరారు చేసారు. దీనితో మళ్లీ రాజకీయాల్లోకి రిఎంట్రీ ఇవ్వనుంది. ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే ఎమ్మెల్సీగా పోటీ చేసి , మరోసారి తన సత్తా ఏంటో చూపించబోతున్నారు.
టీఆర్ ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో..ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ నిలిచినప్పటికీ, టీఆర్ ఎస్ అభ్యర్థిగా కవిత గెలుపుని ఎవరు ఆపలేరు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్ ఎస్ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, బీజేపీ ఓట్ల సంఖ్య 90. దీనితో ఆమె ఎన్నిక లాంఛనమే అనిపిస్తుంది. అలాగే వితను కేబినెట్ లోకి కూడా తీసుకునే ఛాన్స్ ఉందని టీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు.