Begin typing your search above and press return to search.
మంత్రివర్గంలో కవిత ఎంట్రీ.. ఎవరికో ఉద్వాసన?
By: Tupaki Desk | 20 March 2020 3:30 AM GMTతెలంగాణ ఆడపడుచుగా గుర్తింపు పొందిన సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత మళ్లీ ఎట్టకేలకు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఆమె ఎన్నిక లాంఛనమే. త్వరలోనే ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఆమెను హఠాత్తుగా ఎమ్మెల్సీగా చేయడం వెనుక టీఆర్ఎస్ అధినేత ఎంతో కసరత్తు చేశారని సమాచారం. ఆమెను ఎమ్మెల్సీతోనే సరిపెట్టకుండా మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నారని సమాచారం. అందుకే ఆమెను ఎమ్మెల్సీని చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివర్గంలోకి కవిత ఎంట్రీ ఇస్తే ఎవరిని ఖాళీ చేయించి ఆ స్థానంలో కవితను భర్తీ చేస్తారోనని తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవిత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఢిల్లీలో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశారు. అయితే అనూహ్యంగా ఆమె 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లో ఓటమి చెందారు. బీజేపీ చేతిలో ఓడిపోవడంతో టీఆర్ఎస్ తో పాటు అందరూ ఖంగుతిన్నారు. ఆమె ఓటమిని తండ్రిగానే కాకుండా టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఆడపిల్లను ఒంటరిగా చేసి బీజేపీ, కాంగ్రెస్ కుట్రతో ఓడించారని కేసీఆర్ మనసులో నాటుకుపోయింది. దాంతోనే కవిత కలత చెంది రాజకీయాలకు దూరంగా ఇన్నాళ్లు ఉన్నారు. అయితే ఆమెను ఎప్పటి నుంచో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా చేయాలని కేసీఆర్ భావిస్తూనే ఉన్నారు. పరిస్థితులు కలిసి రాలేదు. ఇప్పుడు ఆమెను రాష్ట్ర రాజకీయాల్లో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. ఆ మేరకు నిజామాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణీ చేసిన అనంతరం మంత్రివర్గంలోకి ఆమె రాక లాంఛనమే.
ఎప్పటి నుంచో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది.. అయితే అది వాస్తవమే. కాకపోతే ఇయాల కాకపోతే రేపు ఉంటుంది కానీ కేటీఆర్ మాత్రం పక్కా సీఎం అవుతారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కేటీఆర్ కు తోడుగా కవితను ఉండేలా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆమెను ఎమ్మెల్సీని చేయగా త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకువచ్చి ఇతరులకు చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఇదే జరిగితే త్వరలోనే తండ్రి ముఖ్యమంత్రి, మంత్రులుగా కేటీఆర్, కవిత ఉంటే ఆ మంత్రివర్గం ప్రత్యేకత సంతరించుకునే అవకాశం ఉంది.అయితే కవిత మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇస్తే ఎవరి మంత్రి పదవి ఊడుతుందో తెలియడం లేదు. దీంతో తెలంగాణ మంత్రుల్లో కలవరం మొదలైంది. ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ రెండుసార్లు జరిగింది. ఆ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావును మంత్రులుగా తిరిగి తీసుకోగా.. ఇప్పుడు మూడోసారి మంత్రివర్గ కూర్పులోకి కవితను తీసుకోనున్నారు.
అయితే ఎవరి స్థానంలో ఆమెను భర్తీ చేస్తారేమోనని ఆసక్తిగా మారింది. మంత్రులుగా ఉండి ప్రభావం చూపని వారిపై వేటు పడే అవకాశం ఉంది. మొదటి నుంచి కేసీఆర్ వారి పనితనంపై సర్వే చేసి బహిరంగంగా వెల్లడిస్తుంటారు. ఆ విధంగా గతంలో చేసిన సర్వేలో మంత్రుల పనితనం బాగా లేని వారిని తొలగించి వారి స్థానంలో కవితను తీసుకునే అవకాశం ఉంది. అలాంటి వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన చామకూర మల్లారెడ్డి ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ పనితనం బాగా లేదని తెలుస్తున్నా.. కరోనా వైరస్ నేపథ్యంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నాయకుడు, కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి వెన్నంటే ఉండడంతో ఈటలను తొలగించే సాహసం చేయడం లేదు. అయితే కవిత కోసం తమ మంత్రి పదవులు వదులుకునేందుకు కొందరు సిద్ధమని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి కవిత కోసం త్యాగం చేస్తారని సమాచారం. అయితే కేసీఆర్ అవసరం లేదు.. సర్వే ప్రకారం చర్యలు తీసుకుంటానని కేసీఆర్ చెప్పారంట. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఉన్న జగదీశ్ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలో ఎవరో ఒకరు తప్పుకుంటే కవిత మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.