Begin typing your search above and press return to search.
వెంకయ్య ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ నో ?
By: Tupaki Desk | 10 Aug 2017 5:06 PM GMTఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సిన తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన అకస్మాత్తుగా రద్దయింది. దీంతో రాజకీయ వర్గాల్లో దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బీజేపీ విషయంలో ఆగ్రహంగా ఉన్నారని... రాజకీయంగా తన వెనక బీజేపీ గోతులు తవ్వుతోందని అనుమానిస్తున్నారని.. ఆ క్రమంలోనే ఆయన పర్యటన రద్దు చేసుకన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం కేసీఆర్ గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లి మరునాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన పర్యటన రద్దయింది. తెలంగాణలో తిరుగులేని ఏక చత్రాధిపత్యం సాగిస్తున్న కేసీఆర్ పార్టీ అయిన తెరాసకు చెందిన ఆరుగురు ఎంపీలను బీజేపీ బుట్టలో వేసుకుందని... వారు బీజేపీలోకి జంప్ చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని.. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లకుండా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే కాకుండా జీఎస్టీ విషయంలోనూ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. జీఎస్టీతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కూడా కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఈ అన్ని కారణాలతో కేసీఆర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.