Begin typing your search above and press return to search.
జేజమ్మ గిమ్మిక్కులు పనిచేయలేదా?
By: Tupaki Desk | 2 Oct 2016 4:26 AM GMTగద్వాలలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణకు - తాను ఎన్నటికైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి సకల అర్హతలు ఉన్నదాన్ని అని మాత్రమే కాదు, తననుమించి అర్హతలు ఉన్న వారు కూడా లేరని ఒక నమ్మకం ఉన్నదనం జనం చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఆమె ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శల ఫోకస్ పెడతారు తప్ప.. తన స్థాయికి తక్కువగా భావించి ప్రభుత్వ విధానాలు, చిన్న చిన్న సమస్యల గురించి పోరాడరు అనేది జనంలో నడిచే మాట. ఏది ఏమైనప్పటికీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల కేంద్రంగా తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటు జరగకపోవడం అనేది ఆమెకు చాలా కోపం తెప్పించినట్లుంది. అందుకని.. కేసీఆర్ మీద ఒత్తిడి తేవడానికి అన్నట్లుగా డికె అరుణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఓ ఎపిసోడ్ నడిపించారు. అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఇది పనిచేయలేదని తెలుస్తోంది.
తాను ఎమ్మెల్యే కావడం వల్ల తెరాస నాయకులు గద్వాలను జిల్లా చేయడం లేదని, తాను రాజీనామా చేస్తే వెంటనే జిల్లా చేసేస్తారనేది డికె అరుణ ఆరోపణ. ఈ ఆరోపణలో బలం కనిపించడం లేదనేది పలువురి వాదన. గద్వాలను జిల్లా చేయకపోవడానికి వ్యతిరేకంగా వేల ఫిర్యాదులు ఆన్ లైన్ లో ప్రభుత్వానికి వెళ్లాయని అరుణ చెబుతున్నారు. అయితే అందులో చాలా ఫిర్యాదులు ఒకే వ్యక్తి ఒకే చోటనుంచి పంపినట్లుగా సాంకేతికంగా గుర్తించినట్లు కేసీఆర్ ఇదివరకే ప్రకటించి, గద్వాల జిల్లా సెంటిమెంటు గాలి తీసేసారు. ఆ క్షేత్రస్థాయి వాస్తవాల గురించి వివరణ ఇవ్వకుండా, అరుణ ఏదో రాజీనామా చేస్తాననడం కాసేపు వార్తల్లో ఉన్నదే తప్ప సంచలనం కాకపోయింది. ఆమె కోరుకున్నట్లుగా కేసీఆర్ మీద ఎలాంటి ఒత్తిడి తేలేకపోయింది.
అరుణ రాజీనామాను కేసీఆర్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదన్నది స్పష్టం. అయితే అరుణ కూడా తన పదవి పోయే ప్రమాదం ఇసుమంత కూడా ఉండకుండా.. రాజీనామాను చాలా జాగ్రత్తగా, కేసీఆర్ కు పంపారు. ఆమె సీఎం కేసీఆర్ ను ఉద్దేశించే రాజీనామా లేఖ రాశారు. దానిని స్పీకరుకు పంపాల్సిందిగా కేసీఆర్ ను కోరారు. కానీ ఇలాంటి లేఖలు వంద రాసినా కూడా నయాపైసా ప్రయోజనం ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. రాజీనామా చేయదలచుకుంటే స్పీకర్ ఫార్మాట్ లోనే చేయాలి, స్పీకరుకే ఇవ్వాలి. ఈ సంగతి ప్రజలకు కూడా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో సీఎంను ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖ కేవలం గిమ్మిక్ మాత్రమే అని జనం అనుకుంటున్నారు. వార్తల్లో వ్యక్తిగా ఉండాలని అనుకునే అరుణ తపన కూడా సక్సెస్ కాలేదని అనుకుంటున్నారు.