Begin typing your search above and press return to search.
నయీం ఎమ్మెల్సీలకు నో అపాయింట్మెంట్
By: Tupaki Desk | 18 Sep 2016 7:41 AM GMT నయీం దందాల్లో నిండామునిగిన ఇద్దరు టీఆరెస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు పార్టీలో చివరి గడియలు లెక్కపెడుతున్నట్లు తెలుస్తోంది. వారి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని... తమను కరుణించాలని కోరేందుకు వారు కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలించడం లేదు. వారిని కలిసేందుకు సీఎం నిరాకరించడంతో అన్ని దారులు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. రెండు - మూడురోజుల్లో వీరిని పోలీసులు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకుంటారని జోరుగా సమాచారం. కేసీఆర్ తమపై ఆగ్రహంగా ఉండడంతో వారు ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. నయీం దందాలపై కంప్లయింటు చేసినవారు ఆ ఫిర్యాదులు వెనక్కు తీసుకునేలా చేసేందుకు తమకు తెలిసిన ఇతర పార్టీల నేతలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
నయీం కేసులో ఫిర్యాదు చేసిన భువనగిరికి చెందిన ఓ వ్యాపారికి కరీంనగర్ కు చెందిన మాజీమంత్రి (కాంగ్రెస్)కి మంచి స్నేహితుడు. ఆ వ్యాపారి వద్ద నుంచి నయీం ముఠా భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మధ్యవర్తిగా ఉన్నాడని వ్యాపారి ఇటీవల సిట్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఎమ్మెల్సీ ఈ కేసులో నిండా కూరుకుపోయాడు. అందుకే, సదరు వ్యాపారిని కేసు వాపసు తీసుకుంటే.. నయీంకి చెల్లించిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేస్తానని అతని సన్నిహిత కాంగ్రెస్ నేత ద్వారా బేరసారాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
అలాగే టీఆరెస్ కే చెందిన మరో ఎమ్మెల్సీదీ పరిస్థితి మరీ ఘోరంగా ఉందట. నిత్యం కేసీఆర్ కు భజన చేసే ఆయనకు నయీంతో లింకులు బయటపడడంతో సీఎం అపాయింట్మెంట్ కూడా నిరాకరించారు. దీంతో ఏ క్షణమైనా అరెస్టు తప్పదని డిసైడైన ఆయన కొద్దికాలం అండర్ గ్రౌండులోకి వెళ్లేందుకు ప్లాను చేస్తున్నట్లుగానూ చెబుతున్నారు.