Begin typing your search above and press return to search.

పవన్ తో భేటీకి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదా?

By:  Tupaki Desk   |   2 Nov 2019 6:41 AM GMT
పవన్ తో భేటీకి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎలా ఉంటుందో తాజా పరిణామంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అర్థమై ఉండొచ్చు. అవసరమైతే.. వెనువెంటనే టైం ఇవ్వటమే కాదు.. కలిసే వరకూ ఊరుకోని కేసీఆర్.. తనకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా.. ఎలా రియాక్ట్ అవుతారన్న విషయంపై పవన్ కు తాజా ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చిందని చెప్పక తప్పదు.

దగ్గర దగ్గర నాలుగు వారాలుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో.. ఈ ఇష్యూ మీద తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవుతానని.. సమస్య పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లుగా పవన్ చెప్పటం తెలిసిందే. తనకు సంబంధించిన విషయాల మీద ఎవరో వచ్చి సలహాలు ఇస్తామంటే ఓకే అనటానికి ఆయన కేసీఆర్ అన్న సంగతి మర్చిపోకూడదన్న మాట వినిపిస్తోంది.

తాను పర్సనల్ గా తీసుకున్న ఇష్యూ మీద వెనక్కి తగ్గమని చెప్పటానికి పవన్ కల్యాణ్ ఏంది? ఎవరొచ్చినా వారిని కలుసుకోవటానికి కూడా కేసీఆర్ ఇష్టపడరు. ఆ విషయం తాజాగా పవన్ కు బాగానే అర్థమైంది. అప్పట్లో తనను కలిసేందుకు ఇంటికి ఆహ్వానించిన కేసీఆర్.. సరిగ్గా ప్రగతిభవన్ కు చేరుకునేసరికి రాజ్ భవన్ కు వెళ్లటం తెలిసిందే. దాదాపు గంటకు పైనే పవన్ ను వెయిట్ చేయించిన కేసీఆర్ తీరుపై అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి.

కేసీఆర్ మైండ్ సెట్ మీద అవగాహన లేక పవన్ తొందరపడి కలుస్తానని మాటను మీడియా ముందు రావటం.. ఇప్పుడేమో ట్రై చేస్తే ఎలాంటి రియాక్షన్ లేకపోవటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ను కానీ మంత్రి కేటీఆర్ ను కానీ కలిసేందుకు తాను ప్రయత్నం చేశానని.. కానీ వారి నుంచి సానుకూలత రాలేదని పవన్ పేర్కొనటం గమనార్హం. పవన్ కలుస్తానని అదే పనిగా ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేకపోవటం చూస్తే.. పవన్ స్థాయి అంతకంతకూ పడిపోతుందా? అన్న భావన కలగటం ఖాయం.