Begin typing your search above and press return to search.

హరీష్‌ కు డ్యూటీ వేయలేదేంటి చెప్మా!

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:50 AM GMT
హరీష్‌ కు డ్యూటీ వేయలేదేంటి చెప్మా!
X
తెలంగాణలో కొత్త జిల్లాల వ్యవహారం అంతా తుది దశకు చేరుకుంటున్నది. మరి కొన్ని రోజుల్లో విజయదశమి నాటికి కొత్త జిల్లాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మొత్తం 31 జిల్లాలను కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఇంకా నాయకులు ఎవరికి వారు కొత్త కొత్త డిమాండ్లతో తమకు కూడా ఒక జిల్లా కావాలంటూ వస్తూ ఉంటే.. వాటన్నింటినీ తోసిపుచ్చారు. కొత్త డిమాండ్లను పరిశీలించేది లేదని తేల్చేశారు. 31 జిల్లాల ఏర్పాటు స్వరూపాన్ని శుక్రవారం జరిగే కేబినెట్‌ భేటీ ముందు పెట్టబోతున్నారు.

అయితే ప్రతి కొత్త జిల్లాను ఒక మంత్రి లేదా అధికారి ప్రారంభించేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేశారు. దాదాపుగా అందరు మంత్రులకు కొత్త జిల్లాలను ప్రారంభించే భాగ్యం దక్కుతోంది. అయితే ఒక్క హరీష్‌ రావుకు మాత్రమే జిల్లాను ప్రారంభించే డ్యూటీ పడలేదు. హరీష్‌ రావుకు జిల్లాను ప్రారంభించే బాధ్యత లేకపోవడానికి ఏమైనా ప్రత్యేకకారణాలు ఉన్నాయా లేదా.. హరీష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా అవుతుండగా, దానిని ఏకంగా సీఎం స్వయంగా ప్రారంభిస్తున్నందున .. ఆ కార్యక్రమంలో హరీష్‌ కూడా వెంట ఉండాలి కాబట్టి.. వేరే ప్రారంభోత్సవాల పని ఆయనకు అప్పగించలేదా అనేది చర్చ.

అయితే మంత్రులందరికీ ఒక రకం బాధ్యతలు అప్పగించి, ఒక్క హరీష్‌ కు మాత్రం అప్పగించకపోవడం అనేది ఖచ్చితంగా జనంలో రకరకాల సందేహాలను కలిగిస్తుందనం విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/