Begin typing your search above and press return to search.
జగన్ విషయంలో కేసీఆర్ పొరపాటుచేశారా?
By: Tupaki Desk | 20 Aug 2016 6:23 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అఖిలపక్ష భేటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికి సంబందించి అన్ని పార్టీలకూ ఆహ్వానాలను పంపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సమయంలో ఆయన చేసిన చిన్న పనో లేక పొరపాటో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీస్తుంది. దీనిపై కొంతమంది ఇది జగన్ కు అవమానమే అని మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. ఇది కేసీఆర్ కు ఇబ్బందికలిగించే అంశం అని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కేసీఆర్ హుందాతనాన్ని తగ్గిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేల్ని గెలుచుకుంది. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా తెలంగాణలో కాస్త అటు ఇటుగా నిలబడింది. అయితే అనంతరం జరిగిన పరిణామాలు - ఓటుకు నోటు కేసు మొదలైన వ్యవహారాలతో టీడీపీ నేతలంతా ఒక్కొక్కరుగా సైకిల్ దిగి కారెక్కేసారు. అయినా కూడా టీటీడీపీని ఆహ్వనించడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి మాత్రం కారెందుకు ఎక్కలేదనేది ప్రత్యేకంగా ప్రస్థావించుకోవాల్సిన అవసరం లేదు!
దీంతో వైకాపా అధినేత జగన్ - కేసీఆర్ లు లాలూచీ పడ్డారనే విమర్శలకు బీటలు వారుతున్నాయి. అయితే టీడీపీని పిలవడంపై.. తెరాస - టీడీపీ లు సర్ధుకుపోతున్నాయా అనే అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వైకాపాకు ప్రస్తుతం ఎమెల్యేలు లేరు కాబట్టి.. పిలవకపోవడం కరెక్టే అని సమర్ధిస్తున్నవారు... "ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలకు ఆహ్వానం పంపించాల్సి ఉంది" అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఏది ఏమైనా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో ఆహ్వానించకపోవడం తెలంగాణ ప్రభుత్వం చేసిన పొరపాటే అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది! ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.