Begin typing your search above and press return to search.
కొరతపై కేసీఆర్ అప్ డేట్ కావటం లేదా?
By: Tupaki Desk | 28 Nov 2016 4:11 AM GMTఅవసరానికి మించిన డిమాండ్లను తెర మీదకు తీసుకురావటంలో.. కేంద్రంనుంచి ముక్కుపిండి వసూలు చేయటంలో మొనగాడు ముఖ్యమంత్రిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు ఎపిసోడ్ లో తప్పులు చేస్తున్నారు. రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల కొరత భారీగా ఏర్పడిన వేళ.. రిజర్వ్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీని.. చిల్లర నోట్లను తెప్పించే విషయంలో తప్పటడుగులు వేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బ్యాంకుల్లో ప్రజలు భారీగా డిపాజిట్ చేస్తున్నా.. అందుకు తగ్గ నోట్లను చలామణిలోకి తెచ్చే విషయంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఒకపక్క నోట్ల కొరతతో రాష్ట్ర ప్రజలు విలవిలలాడుతుంటే.. ఇంకోవైపు కరెన్సీ నోట్ల కోసం చేస్తున్న డిమాండ్లు చాలా పేలవంగా ఉన్నాయని విమర్శ వినిపిస్తోంది. ఇందుకు తగిన గణాంకాల్ని పలువురు చూపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ను కరెన్సీ నోట్లను అడుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాస్తవ సమస్యల్ని పరిగణలోకి తీసుకోకుండా అడుగుతుందన్న మాట వినిపిస్తోంది. నోట్ల కొరత నేపథ్యంలో తమకు రూ.5వేల కోట్లు కావాలని అడిగారని.. కానీ.. ఈ మొత్తం చాలా తక్కువని చెబుతున్నారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లు పంపాలన్న డిమాండ్ ను తెరపైకి చాలా ఆలస్యంగా తెచ్చినట్లుగా చెబుతున్నారు.
రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు బ్యాంకుల ద్వారా జమ చేసిన మొత్తం దాదాపుగా రూ.35వేల కోట్ల వరకూ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవంబరు 9 నుంచి ఈ నెల 26 వరకు లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే బ్యాంకులకు వెళ్లిన మొత్తం రూ.35వేల కోట్లు అయితే.. బ్యాంకుల ద్వారా విడుదలైన నగదు కేవలం రూ.14వేల కోట్లు మాత్రమేనని తెలుస్తోంది.
చిల్లర నోట్ల సమస్య ఇంత తీవ్రం కావటానికి కారణాలు వెతికితే.. తెలంగాణ రాష్ట్రంలోకి చలామణిలోకి వచ్చిన రూ.14వేల కోట్ల రూపాయిల్లో రూ.13వేల కోట్లు కేవలం రూ.2వేల నోట్లు మాత్రమేనని.. ఇదే చిల్లర సమస్యకు అసలు కారణంగా చెబుతున్నారు. చిల్లర నోట్ల చలామణి తక్కువగా ఉండటం.. రూ.500 నోట్లు ఇప్పటికి అందుబాటులోకి రాకపోవటంతో చిల్లర సమస్య మరింత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.
ప్రజలు తమ ఖాతాల్లో జమ చేసిన మొత్తంతో పోలిస్తే.. ఆర్ బీఐ విడుదల చేసిన మొత్తం 40 శాతానికి మించకపోవటం నోట్ల కొరతకు కారణంగా చెబుతున్నారు. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించటంలో తప్పు చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నోట్ల కొరత భారీగా ఉన్నా.. రూ.5వేల కోట్లు తమకు పంపాలని అడగటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నోట్ల కొరతను ఒక కొలిక్కి తీసుకురావాలంటే రిజర్వ్ బ్యాంకు నుంచి భారీ మొత్తాన్ని తెప్పించటం.. అవి కూడా చిల్లర నోట్లు అయితేనే సమస్య ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. అన్ని అంశాల మీద అప్ డేట్ గా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్.. కరెన్సీ నోట్లకొరత పైనా సరిగా అప్ డేట్ కాలేదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఆయన కానీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని ఉంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే నగదు.. ఆర్ బీఐ నుంచి వస్తున్న నగదును లెక్క తేడా ప్రముఖంగా చూపించి.. పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను తెలంగాణకు తీసుకొచ్చేలా ప్రయత్నించే వారిని చెబుతున్నారు. కొరత మీద ఆయనకు పూర్తి అవగాహన ఉంటే.. ఆర్ బీఐని రూ.5వేల కోట్లు కావాలని ఎట్టి పరిస్థితుల్లో అడిగే వారే కాదని చెబుతున్నారు. మరి.. కేసీఆర్ కు కరెన్సీ కొరత పట్టటం లేదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/