Begin typing your search above and press return to search.
కేసీఆర్ దైవదర్శనం..రెండు ఆశ్చర్యపోయే ప్రశ్నలు
By: Tupaki Desk | 31 Dec 2019 2:24 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ పర్యటన ఊహించని వివాదాన్ని తెరమీదకు తెచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడినుంచి మిడ్‌మానేరు డ్యామ్ వద్దకు చేరుకుని కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. రిజర్వాయర్ నీటిలో పూలు వదిలి - హారతి ఇచ్చారు. అయితే, ఈ టూర్ సందర్భంగా చేసిన భద్రతా ఏర్పాట్లు - గతంలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి.
సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటనపై కాంగ్రెస్ నేత - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ...యాదాద్రికి ఇచ్చే ప్రాధాన్యత వేములవాడకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పేదల దైవం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ నాలుగేళ్ల కింద చేసిన ప్రకటనను మరోసారి రాజన్న సాక్షిగా గుర్తు చేసుకోవాలన్నారు. అప్పటికి ఇప్పటికి గుడి - పరిసరాలు అలాగే ఉన్నాయని జీవన్ రెడ్డి చెప్పారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శనానికి వస్తున్నారంటూ వేములవాడ దేవస్థానంలో ఉదయం 9 గంటల నుంచే ఆలయ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. రోడ్లపై ట్రాఫిక్ ను ఆపి ఎక్కడివారిని అక్కడే నిలిపేశారు. జాతర గ్రౌండ్ ఏరియా నుంచి వచ్చే చోట - అమ్మవారి కాంప్లెక్స్ దగ్గర - ధర్మగుండం వద్ద - బద్దిపోచమ్మ గుడి నుంచే వచ్చే దారుల్లో బారికేడ్లు పెట్టి ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వాస్తవానికి ఉదయం పదిన్నరకే సీఎం వస్తారని అధికారులు చెప్పారు. కానీ సీఎం వచ్చేసరికి 12 గంటలు దాటింది. సుమారు గంటకుపైగా సీఎం - మంత్రులు - వారి కుటుంబ సభ్యులు ఆలయం వద్ద ఉన్నారు. తర్వాత ఒకటిన్నర సమయంలో మిడ్మానేరు ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. ఈ ప్రహసనంపై ఓడిశాకు చెందిన ఓ మహిళ స్పందిస్తూ....‘రాజన్న గొప్ప దేవుడని ఒరిస్సా నుండి వచ్చాం - కానీ మాకు దర్శనం లేకుండా సీఎం చేశారు…ఇలాంటి చీఫ్ మినిస్టర్‌ను ఎక్కడ చూడలేదు..మా చీఫ్ మినిష్టర్ చాలా గొప్పవాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.