Begin typing your search above and press return to search.
మరోసారి 'సారూ.. కారు.. 16..': సక్సెస్ అయ్యేనా..?
By: Tupaki Desk | 28 Feb 2022 4:29 AM GMTసారూ.. కారు.. 16.. ఈ నినాదం ఎవరిదో అందరికీ తెలసిందే.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లలో ఒక్కటి మినహా మిగతా వాటన్నింటిని కైవసం చేసుకోవాలన్న ఉద్ధేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఈ నినాదాన్ని ఎన్నికల్లో వినిపించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ కు ఈ నినాదం సక్సెస్ గా మారిందా..? అంటే లేదనే చెప్పాలి. ఆ సమయంలో 16 ఎంపీ స్థానాల్లో 9 స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలిచింది. మిగతా స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితా తాజాగా గులాభీ నేత మరోసారి ఈ నినాదాన్ని పైకి తేనున్నారు. ఈసారి 16కు 16 స్థానాలను గెలుచుకొని దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు.
గత కొన్ని రోజులగా కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో ఒకటి ఎంఐఎంకు కేటాయిస్తే మిగతా 16 చోట్ల టీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ఈ మొత్తం సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవాలని భారీ ప్రణాళికే వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జారీపోయిన సెగ్మెంట్లలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. అయితే అందుకు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నాలుగు స్థానాల్లో ఉన్న బీజేపీ మరికొన్ని చోట్ల గెలుస్తామని అంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఎమ్మెల్యేతో పాటు ఎంపీ స్థానాలపై గురి పెట్టింది. ఇప్పుడున్న వాటితో పాటు మరికొన్నింటిలో గెలిచేందుకు రెడీ అవుతున్నారు.
2019 ఎన్నిక్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే నల్గొండ,మల్కాజ్ గిరి, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే ఆ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయనుకున్న టీఆర్ఎస్ కు బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడింటిని చీల్చింది. అయితే ఈసారి ముఖ్యంగా గతంలో ఓడిపోయిన స్థానాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రజల్లో పట్టున్న నాయకులను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. అవసరమనుకుంటే ఇతర పార్టీల్లోనుంచి లాగైనా సరే ఆ జారిపోయిన స్థానాలను గెలిచేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ఇప్పటి వరకు సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, స్థానాల్లో టీఆర్ఎస్ గెలుచుకులేదు. దీంతో ఈసారి ఈ స్థానాలపై విజయం కోసం వ్యూహం పన్నుతున్నారు. 16 సీట్లను గెలుచుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో దూకుడుమీదున్న టీఆర్ఎస్ కు ఎంపీ స్థానాల్లో మాత్రం కలిసి రావడం లేదు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో భారీ విజయం సాధించింది. 100 స్థానాలు అంచానలు వేసుకున్న గులాబీ బాస్ కు దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన పాచిక పారనట్లు తెలుస్తోంది.
అయితే 2024 ఎన్నికల్లో మరోసారి సారు.. కారు.. 16 నినాదాన్ని తెరపైకి లేపనున్నారు. 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీలతో సమావేశం అవుతున్న కేసీఆర్ ఎక్కువగా నేషనల్ పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టారు. అసెంబ్లీ స్థానాలు ఎలాగూ తన ఆధీనంలో ఉంటాయని.. కానీ ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ మరోవైపు బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ సీట్లపై కన్నేసింది. ఇక కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లలోనైనా గెలిచేలా కసరత్తులు ప్రారంభించింది. మరి ఈ నేపథ్యంలో సారు.. కారు.. 16 నినాదం సక్సెస్ అవుతుందా..?చూడాలి..