Begin typing your search above and press return to search.

ఇంత చిన్న విష‌యాన్ని నాన్చుడేంది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:22 AM GMT
ఇంత చిన్న విష‌యాన్ని నాన్చుడేంది కేసీఆర్‌?
X
అర్థ‌ రూపాయి చేతికి ఇచ్చి.. ఇది స‌రిపోతుందా? అంటూ సంబ‌ర‌ప‌డిపోయేలా చేయ‌ట‌మే కాదు.. త‌మ జీవితంలో త‌న‌ను మ‌ర్చిపోలేనంత అనుభ‌వాన్ని ఇచ్చి పంపుతుంటారు. అలాంటి కేసీఆర్ కొన్ని చిన్న విష‌యాల్లో మాత్రం చాలా ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆయ‌న‌కు వ‌చ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే అలా ఉంటార‌ని చెబుతుంటారు.

తాజాగా త‌న మాన‌స‌పుత్రిక అయిన బ‌తుక‌మ్మ చీర‌ల‌కు సంబంధించి ప‌వ‌ర్ లూం కార్మికుల స‌మ‌స్య‌ను తీర్చ‌టం కేసీఆర్‌ కు క్ష‌ణాల ప‌ని. వారు అడుగుతున్న‌ది కూడా పెద్ద అంశం ఏమీ కాదు. ప్ర‌భుత్వం మీద వంద‌ల కోట్ల భారం ప‌డేది కూడా లేదు. అలాంటి చిన్న చిన్న ఇష్యూల్ని సింఫుల్ గా తేల్చేస్తే అయిపోయే దానికి అంత ర‌చ్చ అవ‌స‌ర‌మా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

బ‌తుక‌మ్మ వ‌చ్చినంత‌నే తెలంగాణ వ్యాప్తంగా ఉండే మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల్ని క‌ట్ట‌బెట్టే సంప్ర‌దాయాన్ని ముఖ్య‌మంత్రి షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. చీర‌ల ఎంపిక‌లో దొర్లిన త‌ప్పులు ప్ర‌భుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టాయి. ఈ నేప‌థ్యంలో బ‌తుక‌మ్మ చీర‌ల విష‌యంలో స‌ర్కారు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటోంది. ఇదిలా ఉంటే.. ఈ ప‌థ‌కంలో భాగంగా పంపిణీ చేసే చీర‌ల డిజైన్ గ‌తంతో పోలిస్తే తాజాగా భారీగా పెరిగిపోయింది.

మారిన డిజైన్ పుణ్య‌మా అని ఉత్ప‌త్తి మీద ప్ర‌భావం ప‌డింది. దీంతో.. గ‌తంలో మాదిరి వేగంగా చీర‌లు త‌యారు చేయ‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఇచ్చిన‌ కూలికి అద‌నంగా మీట‌రుకు రూ.5 చొప్పున ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు. ఇప్పుడున్న కూలీల ప్ర‌కారం నెల‌కు రూ.5వేల‌కు మించి రాని పరిస్థితి. తెలంగాణ ఆడ‌ప‌డుచులు క‌ట్టే కోక‌ల్ని త‌యారు చేసే మ‌హిళ‌ల‌కు అసంతృప్తి లేకుండా ఉండేలా చేయాల్సిన బాధ్య‌త కేసీఆర్ మీద ఉంది. అయితే.. ఈ విష‌యాన్ని కేసీఆర్ దృష్టి వ‌ర‌కూ వెళ్ల‌కుండా ఆపుతున్నారా? లేక‌.. గులాబీ బాసే ప‌ట్టించుకోకుండా ఉన్నారా? అన్న‌దిప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది. మీట‌రుకు రూ.5 చొప్పున పెంచితే మంచి ఉత్సాహంగా చీర‌లు త‌యారు చేస్తే.. అంతిమంగా ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ సొంత‌మే అవుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.