Begin typing your search above and press return to search.
కేసీఆర్ కేబినెట్ విస్తరణ..మహిళా మంత్రికి చాన్స్
By: Tupaki Desk | 5 Dec 2017 6:39 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా సాగుతోంది. గులాబీ దళపతి - సీఎం కేసీఆర్ కేంద్రంగా చర్చ అంటే హాట్ టాపిక్ అయి ఉంటుందని భావిస్తున్నారు కదా? అవును మీ అంచనా నిజమే. నిజంగానే హాట్ టాపిక్. టీఆర్ ఎస్ లోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత కేబినెట్ లో మార్పు ఖాయమైందట. ఇంతకాలం మహిళామంత్రి లేరంటూ వివిధ వర్గాలు ఎత్తిచూపుతున్న లోపాన్ని ఇక తొలగించేందుదుకు...కేబినెట్ లో త్వరలో మహిళామంత్రి కొలువుదీరబోతున్నారట. ఈ నెలాఖరులో - లేదా జనవరిలో నూతన మహిళామంత్రి రాష్ట్ర కేబినెట్ లో చేరవచ్చన్న సంకేతాలున్నాయి.
ఇంతకీ ఎందుకు ఇంత ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధమయ్యారు అనేది సందేహం అయితే...దీనికి సమాధానం అంతే ఆసక్తికరమైంది. హైదరాబాద్ కు వచ్చిన పేరు కారణంగానే...మహిళా మంత్రి కేబినెట్ లోకి రానున్నారట. హైదరాబాద్ కు పేరొస్తే...మహిళా మంత్రి కేబినెట్ లోకి ఎందుకు వస్తారంటే...దానికో కారణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ అనూహ్య రీతిలో క్రేజ్ వచ్చింది. అయితే మహిళాభివృద్దే లక్ష్యంగా జీఈఎస్ సదస్సు జరగ్గా - మహిళా మంత్రి లేని లోటు స్పష్టమైంది. సదస్సు ప్రభుత్వానికి అద్భుతంగా పేరు తీసుకొచ్చినా...మహిళా మంత్రి విషయంలో వేదిక మీద మంత్రి కేటీఆర్ ను అడిగిన ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సివచ్చింది. మహిళా మంత్రి లేకపోవడం వల్ల కొన్ని కీలక వేదికలపై ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మహిళలు మంత్రివర్గంలో లేని లోటు స్పష్టమవుతోంది. దీంతో మహిళా మంత్రులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు.. మగమంత్రులు నిర్వహిస్తుండగా ఒకింత ఇబ్బందికర వాతావరణం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు - టీఆర్ ఎస్ ముఖ్యుల్లో జరుగుతున్న చర్చ ప్రకారం...మహిళా మంత్రి విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారని, జనవరి నాటికి మహిళా మంత్రి కొలువుదీరే అవకాశం ఉందని టీఆర్ ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా రాష్ట్ర కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులు ఉండగా - నిబంధనల ప్రకారం అంతకుమించి తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకరు కేబినెట్ లోకి రావాలంటే.. మరొకరు బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. దీంతో ఇన్ అండ్ ఔట్ లపై టీఆర్ ఎస్ లో విస్తృత చర్చ జరుగుతోంది. పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కం మంత్రిని లేదా చాలాకాలంగా పేరు వినిపిస్తున్న మరో మంత్రిని తొలగించి....అదే సామాజికవర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేకు మంత్రి పదవి చాన్స్ ఇవ్వవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం టీఆర్ ఎస్ నుండి గెలిచిన ఆరుగురిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా.. పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గా - గొంగడి సునిత మహేందర్ రెడ్డి విప్ గా పనిచేస్తున్నారు. అయితే ఇద్దరిలో ఒకరిని మంత్రిగా తీసుకుంటారా.. అన్న చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవాలనుకుంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక మంత్రిని పక్కనబెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు ప్రస్తుత హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించి.. మంత్రిగా రిలీవ్ చేస్తారా? లేక మరెవరికైనా వేటు పడుతుందా అన్న చర్చ జరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా మంత్రిని నియమించాలనుకుంటే పద్మా దేవేందర్ రెడ్డి లేదా గొంగడి సునితలలో ఒకరిని చాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. వరంగల్‌కు చెందిన కొండా సురేఖ గతంలో మంత్రిగా పనిచేశారు. అయితే అదే జిల్లాకు చెందిన చిరకాల ప్రత్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టీఆర్ ఎస్ లోనే ఉన్నందున ఒక వర్గానికి ఇచ్చి.. మరో వర్గాన్ని అసంతృప్తికి గురిచేసే అవకాశం లేదంటున్నారు. ములుగు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజ్మీరా చందూలాల్ ను తొలగించి.. ఆస్థానంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోవా లక్ష్మిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. చందూలాల్ లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేత కాగా - కోవా లక్ష్మి కోయ సామాజికవర్గానికి చెందిన నేత. ఎస్టీలోని ఈ రెండు సామాజికవర్గాల మధ్య పలుజిల్లాల్లో ఘర్షణలు జరుగుతుండగా.. ప్రధానంగా ఆదిలాబాద్ - ఖమ్మం జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మంత్రిని కదిలించే వాతావరణం లేదంటున్నారు. మొత్తంగా మహిళలకు ప్రాతినిధ్యం లేదన్న అపప్రదను తొలగించుకోవాలని టీఆర్ ఎస్ పెద్దలు గట్టిగా యోచిస్తున్న నేపథ్యంలో... కొందరు మంత్రుల్లో గుబులు నెలకొందని అంటున్నారు.