Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేలకు షాకివ్వనున్న కేసీఆర్
By: Tupaki Desk | 6 Jun 2017 5:31 AM GMT``ప్రాజెక్టుల రీ డిజైనింగ్`` పేరుతో తెలంగాణలో నీటి లభ్యత స్వరూపాన్ని మార్చుతున్న తెలంగాణ సీఎం - గులాబీ దళపతి కేసీఆర్ ఇదే రీతిలో ``పార్టీలో కూడా రీ డిజైనింగ్``కు శ్రీకారం చుట్టనున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రాజెక్టుల విషయంలో వాస్తవికతతో ముందుకు సాగినట్లే... ఎమ్మెల్యేల విషయంలోనూ క్షేత్రస్థాయి సమాచారంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కేసీఆర్ నిర్ణయం ఉండనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దన్న ఆలోచన టీఆర్ ఎస్ అధినేత మదిలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరగుతోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30మంది ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ ఎస్ పేరును మార్చేసేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్ తన పార్టీ బలోపేతం కోసం అన్నిచర్యలు తీసుకుంటున్నారు. చేరికలు, ఎన్నికలు వంటివి ఇందులో భాగమే అనేది తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించింది. తరువాత బీఎస్పీ సభ్యులు ఇద్దరు విలీనమయ్యారు. ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు - 12 మంది తెదేపా సభ్యులు తెరాసలో విలీనమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు చేరారు. ఇలా సంఖ్యాపరంగా బలంగానే ఉన్నప్పటికీ తన సారథ్యంలోని ప్రజా ప్రతినిధుల పనితీరు విషయంలో ఆరు నెలలకు ఓసారి కేసీఆర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో ప్రజలు సీఎం పనితీరుకు - పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చూపుతున్నారని తేలింది.
ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో కొందరు, టీఆర్ ఎస్ నుంచి గెలిచిన వారిలో కొందరిపట్ల సర్వేలో వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని శాసన సభ్యులకు సూచనప్రాయంగా వెల్లడించారు. మీలో కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాలని, సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. అయితే కొందరిలో మార్పు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఈసారి మార్పు తప్పదని తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సిఫారసులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధంగా శాసనసభ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వ్యక్తమైన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఖాయమని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/