Begin typing your search above and press return to search.
పాపం కేసీఆర్.. సంతోష పడాలా..? బాధ పడాలా..?
By: Tupaki Desk | 21 May 2019 2:30 PM GMT‘ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ను కూడా ఎవరూ విశ్వసించడం లేదు. కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీయే - యూపీఏకు స్పష్టమైన మెజారిటీ రాదు. అందుకే ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతాయి. తెలంగాణలో ఉన్న 17 సీట్లలో టీఆర్ ఎస్ ను గెలిపిస్తే.. ఢిల్లీలో చక్రం తిప్పుతాం. మనం నిర్ణయించిన వ్యక్తినే ప్రధానిని చేస్తాం’’ ఇవీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిరోజులుగా చేస్తున్న కామెంట్లు. ఢిల్లీలో కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు - నాయకులను కలిశారు. ఈ క్రమంలోనే ఎంతో ధీమాగా వ్యవహరించారు. ఇందులో భాగంగానే పై విధంగా కామెంట్లు చేస్తూ వచ్చారు.
తెలంగాణలో గత ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకుని కూడా కేంద్రంలో ఏమీ చేయలేకపోయిన కేసీఆర్... ఈ సారి అంతే సంఖ్యలో సీట్లు వచ్చినా కేంద్రంలో చక్రం తిప్పొచ్చని అంచనా వేశారు. కానీ, ఇప్పుడేమైంది..? గత ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో జాతీయ సర్వే సంస్థలన్నీ కేంద్రంలో మరోసారి మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఖాయమని స్పష్టం చేశాయి. అయితే, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కారు పార్టీ.. ఆ జోరును లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తెలంగాణలో టీఆర్ ఎస్ కు 14 నుంచి 16 సీట్లు దక్కుతాయని సర్వే ఫలితాలను బట్టి అంచనా వేస్తున్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో టీఆర్ ఎస్ లో వింత పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో అనుకున్న 16 సీట్లకు ఇంచుమించుగా దక్కించుకుంటున్నా.. కేంద్రంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు సర్వే ఫలితాలతో సంతోష పడాలా..? బాధపడాలా..? అర్థం కాని పరిస్థితి అని చెప్పడంలో సందేహం లేదు. మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ సహా పలువురు నేతలను కలుసుకుని ఆయన చర్చలు జరిపారు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఇప్పుడేమో ఎగ్జిట్ పోల్స్ మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ఇవ్వడంతో కేసీఆర్ కల చెదిరినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.