Begin typing your search above and press return to search.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   9 Sep 2019 9:13 AM GMT
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
X
తెలంగాణలో రైతుబంధు పథకం ప్రారంభించినప్పుడు దేశమంతా నోరెళ్లబెట్టింది. రైతులకు ఎకరానికి రూ.5వేలు. సంవత్సరానికి 10వేల పంట సాయం పెట్టుబడిగా అందడంతో తెలంగాణ రైతాంగం కూడా కేసీఆర్ ఫొటోల నెత్తిన పాలుపోసింది. అహాఓహో అంటూ కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలుచేయాలని డిమాండ్లు వినిపించాయి. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో కలుస్తామంటూ సరిహద్దులు దాటి వచ్చారు.

అయితే ఇదంతా గతం..వర్తమానంలో మాత్రం రైతుబంధుకు నిధులు అందక.. సర్కారు రైతుల ఖాతాల్లో జమ చేయలేక అష్టకష్టాలుపడుతోంది. ఒక్కో జిల్లాలో సగం కూడా డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. స్వయంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే రైతులకు 125 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 65వేల కోట్లు మాత్రం చెల్లించారు. మిగతా రైతులకు ఆపేశారు. జాప్యం చేస్తున్నారు.

10 ఎకరాలకు మించి భూములున్న మెజార్టీ రైతులకు ఈసారి రైతుబంధు ఎకరానికి 5వేలు జమకాలేదు. వారంతా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.

అయితే రైతుబంధుకు నిబంధనలు పెడుతున్నారని.. పథకాన్ని నీరుగారుస్తున్నారని.. లేదంటా 10 ఎకరాలకే కటాఫ్ పెడుతున్నారనే విమర్శలు వచ్చిన వేళ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. రైతుబంధును యథావిధిగా కొనసాగిస్తామని.. కటాఫ్ లు, 10 ఎకరాల లిమిట్ లేకుండా అందరూ రైతులకు డబ్బులను వేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక మాంద్యం వల్లే రైతులకు ఎకరానికి రూ.5వేల జమలో ఆలస్యమైందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. త్వరలోనే వేస్తామన్నారు.