Begin typing your search above and press return to search.
ఇంత ధైర్యంగా కేసీఆర్ మాత్రమే చెప్పగలరు
By: Tupaki Desk | 5 Jan 2017 6:03 AM GMTసాధారణంగా యువత - మహిళలు - ఒకట్రెండు వర్గాల వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరు. పైగా రాజకీయ నాయకులు అసలే మాట్లాడరు. అధికారంలో ఉన్న వారైతే యువతకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనేందుకు దైర్యం చేయరు. మనసులో ఉన్నమాటలను కూడా అణిచివేసుకుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి స్టైలే వేరు కదా. అలాంటి విభిన్నమైన వ్యక్తిత్వంతోనే చదువుకున్న యువత కల అయిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కుండబద్దలు కొట్టిన ప్రకటన చేశారు కేసీఆర్. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.
అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో మూడు లక్షలకు మించి ఉద్యోగావకాశాలు ఉండవని తెలిపారు. అవసరం మేరకు నియామకాలు జరిపినప్పటికీ చదువు కున్న వారందరికీ ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడానికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా వెళ్లడం ప్రధానమన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యను అభ్య సించినవారితో పాటుగా వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసిన వారందరికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ వివరించారు. కాలేజీల నుండి బయటికి వచ్చిన వెంటనే ఉపాధి పొందే విధంగా సరికొత్త కోర్సులను రూపొందించడం జరుగుతుందని కేసీఆర్ వివరించారు. బీఈడీ - డీఈడీ కళాశాలలను కుదించవలసి ఉందని...ఏటా 42 వేల మంది కి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వలేమని కేసీఆర్ తేల్చిచెప్పారు.
చదువుకున్న వారికీ సంబంధిత రంగాల్లో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొనడం ప్రధానమని, ప్రభుత్వంలో కూడా చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు అసాధ్యం అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ విద్యార్దులు హోంగార్డులు - కాని స్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే పరిస్దితి ఉత్పన్నం కాని విధంగా ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ఉత్పత్తి - ఉపాధి అవకాశాలు లక్ష్యంగా ప్రోత్సాహరాలు అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం కంటే కూడా ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, భవిష్యత్ లో చదువులకు అనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/