Begin typing your search above and press return to search.

కేసీఆర్.. హరీష్ కు ఎసరు పెట్టినట్టేనా.?

By:  Tupaki Desk   |   21 Dec 2018 7:59 AM GMT
కేసీఆర్.. హరీష్ కు ఎసరు పెట్టినట్టేనా.?
X
కొడుకు కేటీఆర్ ను ఎప్పుడైతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకరకమైన ప్రక్షాళన ప్రారంభమైందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు పదిరోజుల్లోగా కేబినెట్ ను పునర్వస్త్యీకరిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాటే ఎత్తకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ జిల్లాల పర్యటనలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉండబోతుందట.. దీన్ని బట్టి కేటీఆర్ బ్యాచ్ కే మంత్రి పదవులు దక్కబోతున్నాయనే ప్రచారం టీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే.. మొట్టమొదట నీటి పారుదల శాఖపైనే సమీక్ష జరిపారు. కానీ ఈ మీటింగ్ కు గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖమంత్రిగా చేసిన హరీష్ రావు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తెలంగాణ తొలి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. కృష్ణ, గోదావరిపై ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయించారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావడానికి హరీష్ రావే కారణమని కేసీఆర్ మెచ్చుకున్నారు. కానీ తొలి కేసీఆర్ సమీక్షలో హరీష్ రావును పక్కనపెట్టడంతో ఈసారి ఆయనకు కేబినెట్ లో బెర్త్ దక్కుతుందా.? దక్కితే నీటి పారుదల శాఖ ఇవ్వరనే ప్రచారం సాగుతోంది.

ఈసారి కేసీఆర్ భారీ నీటిపారుదల శాఖను కుమారుడు కేటీఆర్ కు కేటాయించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ శ్రేణులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఈ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలు దేరి వాతావరణం అనుకూలించక వెళ్లలేకపోయారు. ఈ పర్యటనకు కూడా హరీష్ రావును చేర్చకపోవడం చూశాక ఖచ్చితంగా ఆ శాఖను హరీష్ కు ఇవ్వకపోవచ్చనే వాదనలకు బలం చేకూరిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు చూసి హరీష్ రావు అభిమానులు కినుక వహించారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రవర్తన టీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.

హరీష్ రావు విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహరిస్తున్న తీరు చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారట.. కొందరు హరీష్ రావు వద్దకు వచ్చి బాధపడుతున్నట్టు తెలిసింది. కానీ హరీష్ రావు తన మామ కేసీఆర్ పై ఇప్పటికే నమ్మకంగానే ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే కేబినెట్ విస్తరణ తర్వాత హరీష్ రావు పాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటనేది తేలనుంది.