Begin typing your search above and press return to search.
మంత్రుల ఎంపిక కేసీఆర్ లోని భయాన్ని చెబుతుందా?
By: Tupaki Desk | 20 Feb 2019 5:30 PM GMTఎన్నికల ఫలితాలు విడుదలైన 69 రోజులకు మంత్రివర్గ ఏర్పాటు. హరీశ్ లాంటి టాస్క్ మాస్టర్ ను పక్కన పెట్టటం. సీనియర్ మంత్రులకు హ్యాండ్ ఇవ్వటం.. కొలువు తీరిన కేబినెట్ లో కేసీఆర్ తో కలిపి మొత్తం 12 మంది ఉంటే.. వారిలో మొదటిసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారు ఏకంగా ఆరుగురైతే.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో కేవలం నలుగురికి మాత్రం ఈసారి అవకాశం లభించింది.
ఇది పక్కన పెడితే.. తొలిసారి మంత్రులుగా అవకాశం లభించిన ఆరుగురిని చూస్తే.. వారంతా కేసీఆర్ కు వీర విధేయులే కాదు.. ఏ విషయాన్ని అయినా డీల్ చేసే సత్తా ఉన్న నేతలకు మాత్రమే కేబినెట్ లో చోటు లభించటం మరో ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో ఆర్థికంగా అండదండలున్న ఒకరిద్దరు నేతలకు మంత్రివర్గంలో స్థానం లభించటం చూస్తే.. కేసీఆర్ దృష్టి చాలా దూరంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ కేబినెట్ ను చూస్తే ఒక్క విషయం మాత్రం చటుక్కున గుర్తుకు రావటం ఖాయం. తాజాగా కొలువు తీరిన కేసీఆర్ సర్కారులో మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారంతా అధినేతకు జీ హుజూర్ అనే వారు మాత్రమే కానీ.. అంతకు మించి విదేయతను ప్రదర్శించేందుకు సైతం ఓకే ని చెప్పేవారే.
దీనికి తగ్గట్లే.. మంగళవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయటం.. ఆయన వారిస్తూన్నా.. నో.. అంటే నో అన్నట్లుగా సారు కాళ్లకు నమస్కారాలు చేసుకొని వెళ్లే పరిస్థితి. వీరిలోనే మరికొందరు గవర్నర్ కాళ్లకు సైతం పాదాభివందనం చేయటం కనిపిస్తుంది. పెద్దలకు కాళ్ల నమస్కారం చేయటం మన సంప్రదాయంలో మొదట్నించే ఉన్నదే. కాకుంటే కీలక స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి అన్నట్లు కాళ్లకు దండం పెట్టి వెళ్లటం కనిపిసతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే మరో లెక్కన చూస్తే.. తాజా కేబినెట్ విస్తరణ కేసీఆర్ లోని భయం యాంగిల్ ను చెప్పే ప్రయత్నం పలువురు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంత్రుల్లో ఏదైనా అసంతృప్తి పెరిగితే వాటిని కట్ చేసేలా సమాచారం సేకరణకు సెటప్ చేశారు. ఇదే కాకుండా లోగుట్టుగా ఏదైనా జరిగితే.. వెనువెంటనే తన దృష్టికి చేరేలా వ్యవస్థను సిద్ధం చేసుకున్న కేసీఆర్ తీరు చూస్తే.. ప్రస్తుతం ఆయన విపరీతమైన భయాందోళనల మధ్య ఉన్నారా? అన్న సందేహం కలిగేలా ఉందని చెప్పక తప్పదు.సీనియర్లను పక్కన పెట్టేయటం.. జూనియర్లకు మద్దతు ఇవ్వటం లాంటివి చూస్తే.. తనదైన సైన్యాన్ని కేసీఆర్ మొహరించినట్లుగా చెప్పక తప్పదు. మరి.. తాజా కాబినెట్ ను చూస్తే.. విపరీతమైన ఇన్ సెక్యురిటీలో కేసీఆర్ ఉన్నట్లు పలువురు విశ్లేషిస్తుండటం గమనార్హం.