Begin typing your search above and press return to search.

టిఆర్ ఎస్‌ ఎన్నికల జిమ్మిక్కులు.

By:  Tupaki Desk   |   9 Aug 2018 4:15 PM GMT
టిఆర్ ఎస్‌ ఎన్నికల జిమ్మిక్కులు.
X
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైయింది.. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పార్టీ నాయకులు రకరకాలు ఎత్తులు - ఎత్తుకు పైఎత్తులతో సతమతమవుతున్నారు. రాబోయే ఎన్నికలలో తమ పార్టీ స్థితిగతుల గురించి టీఆర్ ఎస్ పార్టీ లోపాయికారిగా సర్వే చేయించినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారిగా ఈ సర్వే జరిగినట్లు సమాచారం. ప్రజలలో తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీపై కొంత మేరాకు పాజిటివ్ ద్రుక్పదం ఉన్నప్పటికీ - కొన్ని నియోజకవర్గాలలో మాత్రం స్దానిక నాయకులపై వ్యతీరేకత ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా ఆయా నియోజక వర్గాలలో ప్రతిపక్ష నాయకులు బలంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం బలహీనంగా ఉన్న నియోజక వర్గాల నాయకులకు తమ అండదండలు అందించాలని కేసీర్ నిర్ణయించినట్లు తెలిసింది.రాబోయే ఎన్నికలలో తమ విజయం ఖాయమని తెలిసిన ఆసెంబ్లీ స్దానాల పట్ల కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల చాల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం.

తమ పార్టీకి అంతగా పట్టులేని నియోజకవర్గాల ప్రజల అవసరాలు తెల్సుకుని వెంటనే వాటిని తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశించినట్లు సమాచారం. టిఆర్ ఎస్ ఎమ్యేలేలు - మంత్రులు తమ‌ నాయకుడి ఆదేశాలు అమలుచేయాటానికి కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాలలో తమ పర్యాటన ప్రారంభించారు. స్దానిక పార్టీ అభ్యర్దిని కూడా వారితో పాటు తీసుకుని వెళ్లి, వచ్చే ఎన్నికలలో భారి మేజారిటీ కోసం పోటి పడుతున్నారు. ఎన్నికలకు ఎంతో సమయంలేనందునా పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతి మూడు లేక నాలుగు నెలలకు వివిధ ఏజన్సీల ద్వారా సర్వే చేయించుకుని - వ్యూహలు పన్నుతున్నట్లు సమాచారం. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు - ప్రభుత్వ పథాకాలను వెంటనే మంజూరు చేయించుకునేందుకు తాము సహాయం చేస్తామని, నియోజకవర్గాల ఇన్‌ చార్జీలు భరోస ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇస్తున్న ఈ భరోసాతో తమ పార్టీ బలపడుతుందని పార్టీలోని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ తమ పథకం పారలేకపోతే కనుక అభ్యర్దుల మార్పుపై కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.