Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫీలయ్యేలా చేస్తున్న జగన్!
By: Tupaki Desk | 9 Jun 2019 6:22 AM GMTపోలికకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. ఒకప్పుడు ఏ పోలికైతే తనకు రక్షగా నిలిచిందో.. ఇప్పుడు అదే పోలిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. కొత్త నీరు వచ్చిన ప్రతిసారీ పాతనీరు పక్కకు తప్పుకుంటుంది. పాలనలో ఐదేళ్ల సీనియర్ అయిన కేసీఆర్ ఇప్పుడు అవుట్ డేటెడ్ గా మారారు. ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు మొనగాడిగా.. తెలివైనోడిగా కీర్తించే కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా మారినట్లుగా చెబుతున్నారు.
ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. వాటిని అమలు విషయంలోనూ పట్టుదలగా ఉన్న జగన్ తీరుతో కేసీఆర్ కు కొత్త తలనొప్పి షురూ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో వినూత్న నిర్ణయాలకు పెట్టింది పేరుగా కేసీఆర్ కు ఉండేది. ఊహలకు అందని రీతిలో ఆయన వినూత్న పథకాల్ని ప్రస్తావించేవారు.
దీంతో కేసీఆర్ నిర్ణయాల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలతో పోల్చేవారు. బాబు కంటే కేసీఆర్ చాలా బెటర్ అని.. పాలనలో ఆయన్ను కాపీ కొట్టక తప్పని పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్ కు కొత్త ఇబ్బందిని తెచ్చి పెడుతున్నాయి. ఆశా వర్కర్లకు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచటం.. వారంలో ఒక రోజు ఫ్రీ బ్యాగ్.. ఉద్యోగులకు పెంచిన ఐఆర్ తోపాటు.. జర్నలిస్టులకు ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచుతూ చకచకా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. అందుకు అవసరమైన జీవోల్ని జారీ చేస్తున్నారు.
ఇలా ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న జగన్ నిర్ణయాలు కేసీఆర్ కు కొత్త ఇబ్బందిని తెచ్చి పెడుతున్నాయి. పోలిక తలనొప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో షురూ అయ్యింది. కేసీఆర్ పాలనా లోపాల్ని ఉతికి ఆరేస్తున్న వారు.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్ని పోల్చటం ద్వారా గులాబీ బాస్ కు కొత్త ఒత్తిడి మొదలైందని చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతకంతకూ పెరిగిన పక్షంలో జగన్ కారణంగా ఆయన స్నేహితుడు.. శ్రేయోభిలాషి అయిన గులాబీ బాస్ కేసీఆర్ ఫీల్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.