Begin typing your search above and press return to search.

కవిత భవిష్యత్ పై కేసీఆర్ కీలక నిర్ణయం?

By:  Tupaki Desk   |   25 Sep 2019 11:49 AM GMT
కవిత భవిష్యత్ పై కేసీఆర్ కీలక నిర్ణయం?
X
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ ముగ్గురు కీలక నేతలు.. హరీష్ రావు - కేటీఆర్ - కవిత.. రెండోసారి కేసీఆర్ గెలిచాక ఈ ముగ్గురిని దూరం పెట్టారు. కేటీఆర్ - హరీష్ లకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో రేగిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఇక నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయాక కవిత యాక్టివ్ రాజకీయాలకు దూరంగా జరిగారు.

అయితే ఇటీవలే హరీష్ - కేటీఆర్ లకు మంత్రి పదవులు ఇచ్చి వారిని సెట్ చేసిన కేసీఆర్ తన కూతురు కవిత విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటేన్ చేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.

నిజానికి కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో ఆమెను హుజూర్ నగర్ లో కేసీఆర్ నిలబెట్టి గెలిపించి శాసనసభకు పంపిస్తారని పార్టలో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు హుజూర్ నగర్ లో సైదిరెడ్డియే అభ్యర్థని తేలింది. మరి కవితను కేసీఆర్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఇప్పడు అందరిలోనూ నెలకొంది.

ప్రస్తుతం కవితకు రెండే ఆప్షన్లను కేసీఆర్ పెట్టుకున్నట్టు తెలిసింది. ఒకటి ఆమెకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ రాజకీయాల్లో పంపడం.. లేదంటే మంత్రిగా చేరిన కేటీఆర్ చేపట్టిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇవ్వడం.. ఈ రెండింటిలో రాజ్యసభ సీటు ఇచ్చేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. త్వరలోనే కూతురు కవితను కూడా కేసీఆర్ సెట్ చేయబోతున్నాడని పార్టీలో చర్చ సాగుతోంది.ఆమెను ఢిల్లీ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించేలా తీర్చిదిద్దబోతున్నట్టు తెలిసింది.