Begin typing your search above and press return to search.

నగర పంచాయతీలు కేసీఆర్ చెల్లుచీటీ!

By:  Tupaki Desk   |   29 March 2018 5:17 PM GMT
నగర పంచాయతీలు కేసీఆర్ చెల్లుచీటీ!
X
న‌గ‌ర పంచాయ‌తీల‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌ర‌ పంచాయ‌తీలను ర‌ద్దు చేస్తున్న‌ట్లు గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 12,751 గ్రామపంచాయతీలు ఏర్ప‌డ‌బోతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. ఇక నుంచి గ్రామపంచాయతీలు - మున్సిపాలిటీలు - మున్సిపల్‌ కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లుపై చర్చ సందర్భంగా కేసీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స్వాతంత్ర్య వచ్చి 71 ఏళ్లయినా గ్రామాలు మురికి కూపాలుగా ఉన్నాయ‌ని - గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను గత పాలకులు విచ్ఛిన్నం చేశార‌ని - ప్ర‌స్తుతం సర్పంచ్‌ ఎన్నికలకు కోట్లు ఖర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ్రామ పంచాయతీలకు ప్ర‌తి బడ్జెట్ లో పెద్ద‌పీట వేస్తామ‌ని - వాటికి దాదాపు రూ.1500 కోట్లు....మున్సిపాలిటీలకు రూ.1000 కోట్లు కేటాయిస్తామ‌ని కేసీఆర్ అన్నారు. రైతుల పంట‌కు గిట్టుబాటు ధర - పంటల విక్రయం సమస్యల పరిష్కారానికే సమితులు ఏర్పాటు చేశామ‌ని - రూ.300 కోట్లతో రైతు వేదికలు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 250 కోట్ల మొక్కలు నాట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని - మెదక్‌ లో అడవుల పునరుద్ధరణ చూసి ప్రధాని ప్రశంసించార‌ని కేసీఆర్ అన్నారు. హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని, నాటిన‌ మొక్కల్లో 85 శాతం బతకకపోతే గ్రామ కార్యదర్శిని తొలగిస్తామని హెచ్చ‌రించారు. అదేవిధంగా మొక్కలు పెంచని సర్పంచ్ ను కూడా తొలగిస్తామని సీఎం అన్నారు.