Begin typing your search above and press return to search.

మ‌రో భారీ క‌ల గురించి చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   27 March 2018 10:08 AM GMT
మ‌రో భారీ క‌ల గురించి చెప్పిన కేసీఆర్
X
క‌మ్మ‌ని క‌ల‌ల్ని క‌న‌టంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీగా.. అక‌ట్టుకునేలా.. అంత‌కు మించి న‌మ్మేసేలా మాట‌లు చెప్ప‌టం అంత చిన్న విష‌యం కాదు. కానీ.. కేసీఆర్ టాలెంట్ అంతా ఇంతా కాదు. త‌ర్వాతి రోజుల్లో జ‌రుగుతుందో లేదో కానీ.. అతికిన‌ట్లుగా చెప్పే ఆయ‌న మాట‌లు కొత్త కొత్త ఆశ‌ల్ని పుట్టేలా చేస్తాయి.

ఆయ‌న చెప్పే క‌ల మాట‌ల మ‌త్తులో.. అప్ప‌టికే ఉన్న రియాలిటీ అస్స‌లు గుర్తుకు రాకుండా పోవ‌టం కేసీఆర్ మాట‌ల మాయాజాలం ఎఫెక్ట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా అలాంటి ముచ్చ‌టే ఒక‌టి చెప్పుకొచ్చారు కేసీఆర్‌. తాజాగా అసెంబ్లీలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేన‌టువంటి అద్భుత‌మైన ఫార్మాసిటీని తీసుకొస్తామ‌ని.. 19వేల ఎక‌రాల్లో దాన్ని రూపొందిస్తామ‌ని భారీ క‌ల‌ను చెప్పారు.

19వేల ఎక‌రాల్లో అద్భుత‌మైన పార్మాసిటీ అంటూ ఊరించేసిన కేసీఆర్.. అంత‌కు మించిన మ‌రిన్ని ముచ్చ‌ట్ల‌ను చెప్పారు. గ‌తంలో అనుస‌రించిన ప్ర‌భుత్వాల పుణ్య‌మా అని.. కార్లో వెళుతుంటే గుప్పుమ‌ని వాస‌న వ‌స్తుంద‌ని.. అంటే అక్క‌డ ఫార్మా కంపెనీ ఉంద‌ని అనుకుంటామ‌ని.. అంత పొల్యూష‌న్ ఉంటుందన్నారు. ప్ర‌తి వంటింట్లోనూ పొల్యుష‌న్ ఉంటుంద‌ని.. వంట గ‌దిని ఎలా శుభ్రం చేసుకుంటామో.. అదే రీతిలో ప‌రిశ్ర‌మ‌ల్ని కూడా చ‌క్క‌గా శుభ్రం చేసుకుంటే.. అక్క‌డ ఫార్మా కంపెనీలు ఉన్న విష‌య‌మే తెలియ‌వ‌న్నారు.

కానీ.. అలాంటివేమీ పాటించ‌క‌పోవ‌టం వ‌ల్ల కాలుష్యం వెద‌జ‌ల్లుతుంటుంద‌న్నారు. విదేశాల్లో ఫార్మా కంపెనీలు ఉన్న ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌వ‌ని.. అంత శుభ్రంగా మొయింటైన్ చేస్తుంటార‌ని చెప్పిన కేసీఆర్‌.. తాము త్వ‌ర‌లోనే వ‌రల్డ్ బెస్ట్ ఫార్మాసిటీని రూపొందిస్తామ‌న్నారు. అమెరికాలో ఏ రీతిలో అయితే వాస‌న రాని ప‌రిశ్ర‌మ‌ల్ని నిర్వ‌హిస్తారో.. అదే రీతిలో ఇక్క‌డ కూడా రాకుండా చూస్తామ‌న్నారు.

అమెరికా కంటే మంచి స్టాండ‌ర్డ్ లో పొల్యూష‌న్ మొత్తం ప్ర‌భుత్వ కంట్రోల్ లో పెట్టి. అందులో ఒక వ‌ర్సిటీ పెట్టి వ‌రల్డ్ బెస్ట్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామ‌న్న మాట‌ను చెప్పారు. ఇన్ని మాట‌ల మ‌త్తులోనూ.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ క్ష‌ణంలో పేలే బాంబు మాదిరి ఉండే జీడిమెట్ల‌.. బాలాన‌గ‌ర్‌.. ఐడీఏ బొల్లారం.. పాశ మైలారం లాంటి ఎన్నో ప్రాంతాల్లో ఎంతోకొంత చేస్తే స‌రిపోతుంది. 19 వేల ఎక‌రాల్లో అద్భుతమ‌ని చెప్పే ముందు.. అందులో ఎంతోకొంత హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ చేస్తే బాగుంటుంది క‌దా? ఉత్తినే మాట‌లు చెప్పి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే బ‌దులు.. వాస్త‌వంలో చేసి చూపిస్తే బాగుంటుంది క‌దా కేసీఆర్‌?