Begin typing your search above and press return to search.
భయపడుతున్న కేసీఆర్..పెడుతున్న కాంగ్రెస్!
By: Tupaki Desk | 13 Aug 2018 6:17 PM GMTభయపెట్టడమే కానీ.. భయపడని కేసీఆర్ అనూహ్యంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా.? పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.. ఏఐసీసీ అధ్యక్షుడు - కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన పట్ల కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేడని వార్తలొస్తున్నాయి. తెలంగాణలో దాదాపు ఏకచ్ఛత్రాధిపత్యంతో దూసుకెళ్తున్న కేసీఆర్ కు రాహుల్ పర్యటన కొరకరాని కొయ్యా గా మారిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఢిల్లీలో జరిగిన పరిణామాలే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఓటింగ్ సందర్భంగా చంద్రబాబు తన బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ పక్షాన నిలబడి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అదే సమయంలో మోడీపై దుమ్మెత్తి పోసి మరీ కేసీఆర్ మళ్లీ ఈ ఎన్నికల్లో మోడీకే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని..తెరవెనుక బీజేపీతో దోస్తీ చేస్తున్నాడని కాంగ్రెస్ కు అర్థమైంది. అందుకే ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు..
ఒక్కరోజు కాదు.. సోమ - మంగళవారాల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ కార్యక్రమాలను రూపొందించారు. దీంతోపాటు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న కోదండ రాం - టీడీపీ నేతలను - ఇతర పక్షాలను అన్నింటిని కూడా రాహుల్ తో భేటి చేయించి మహాకూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసినట్టు తెలిసింది. రాహుల్ గనుక కోదండ - టీడీపీ నేతలతో సమావేశమైతే ఖచ్చితంగా మహాకూటమికి అంకురార్పణ పడుతుందని కాంగ్రెస్ నేతలు భారీ ఆశలు పెంచుకున్నారు. ఎలాగైనా కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే ఈ కూటమి అనివార్యమని రాహుల్ చేత ఈ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ విషయం తెలిసే ఇప్పుడు టీఆర్ ఎస్ - కేసీఆర్ ఆందోళనగా ఉన్నట్టు తెలిసింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సమాచారం. రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో కూడా అడుగడుగునా అడ్డు తగిలేలా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.. మొత్తంగా కాంగ్రెస్ వేసిన ఈ మహాకూటమి ప్లాన్ తో ఇప్పుడు గులాబీ దండులో ఒకానొక భయం నెలకొందని వార్తలొస్తున్నాయి. తెలంగాణలోని ప్రతిపక్షాలన్ని కలిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ అవుతుందని కేసీఆర్ ఆందోళనగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.