Begin typing your search above and press return to search.
జీతాల్లో కోత వేసిన కేసీఆర్..ప్రైవేటు ఉద్యోగులకు షాక్ తప్పదా?
By: Tupaki Desk | 31 March 2020 5:38 AM GMTఆదివారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో కరోనా వేళ.. అందరూ కష్టాల్ని అంతోఇంతో పంచుకోవాలన్న మాటను చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. జీతాల కోతపై ఇండికేషన్ ఇవ్వటం తెలిసిందే. ఉద్యోగుల్ని మానసికంగా సిద్ధం చేసిన ఆయన.. రోజు గడిచేసరికి ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. రాష్ట్ర ప్రభుత్వ రంగ చైర్ పర్సన్లు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోతం.. మిగిలిన అన్ని కేటగిరి ప్రభుత్వ ఉద్యగుల వేతనాల్లో 50 శాతం.. నాలుగో తరగతి.. కాంట్రాక్టు కార్మికులు.. ఔట్ సోర్సింగ్ ఉద్యగుల వేతనాల్లో పది శాతం కోతను విధించారు.రిటైర్డ్ ఉద్యోగులందరి ఫించన్లలో 50 శాతం కోత.. అదే సమయంలో నాలుగో తరగతి రిటైర్డు ఉద్యోగుల ఫించన్లో పది శాతం కోత విధించనున్నారు.
తాజాగా ప్రభుత్వం వెల్లడించిన విధానంతో.. ప్రైవేటు కంపెనీలకు చెందిన ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వమే కోత విధించినప్పుడు.. ప్రైవేటుకంపెనీలు ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. మొత్తానికి కరోనా పుణ్యమా అని అందరూ ప్రభావితం కావటం ఖాయమన్న మాటకు అర్థమేమిటో తెలిసి వచ్చేలా చేసిందంటున్నారు. ఇప్పటికే వచ్చే జీతానికి సంబంధించి బడ్జెట్ ప్లాన్ చేసుకున్న వారందరికి తాజా పరిణామాలు షాకింగ్ గా మారుతాయని చెప్పక తప్పదు.