Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇది భావ్యమా....!
By: Tupaki Desk | 20 July 2018 6:18 AM GMT" అన్నదమ్ములా విడిపోదాం.. కష్టాలు కన్నీళ్లు.. ఆనందాలు సంతోషాలు కలసి పంచుకుందాం...." ఇవీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్న మాటలు. అయితే ఈ మాటలకి ఇప్పుడు విలువ లేదు. ఎవరు ఏమైపోయిన కల్వకుంట్ల వారికి కనికరం లేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కష్టాలలో ఉంటే మాత్రం ఆయనకు పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలుగు ప్రజలు ఏ కష్టంలో ఉన్న తాను వారికి సహకరిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలంటూ మెలిక పెట్టారు. పార్లమెంటులో తమ సభ్యుల చేత ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లడించక పోయినా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాలని సభ్యులకు దిశానిర్దేశం చేసారు. ప్రత్యేక తెలంగాణ వస్తే విజయవాడ కనక దుర్గమ్మకు ముక్కు పుడకను మొక్కుకున్న కేసీఆర్ ఇటీవలే ఆ మొక్కు తీర్చుకున్నారు.
అంతకుముందు తిరుపతి వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని మొక్కులూ తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉన్న దైవాల మొక్కును తీర్చుకున్న కేసీఆర్ అక్కడి ప్రజల కష్టాలలో మాత్రం పాలుపంచుకోవడం లేదు. ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడితే ఢిల్లి స్దాయిలో రాజకీయంగా కలసి రాదన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. పైకి బిజేపితో వైరం ఉన్నట్లుగా రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ చేసిన హడావుడి అంతా జిమిక్‌గానే కనబడుతోంది. తాను భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలమని ఆయన చర్యలు తెలియజేస్తున్నాయి. తనకు ఇవ్వకపోయిన పర్వాలేదు, పొరుగు వారికి మాత్రం ఇవ్వకు అన్న చందంగా ఉంది కేసీఆర్ ఆలోచన. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగర్భ శత్రువే అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా శత్రువులుగా చూడలన్న కేసీఆర్ భావనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం మవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులకు తొమ్మిది నిమిషాల సమయం కేటాయించారు. ఈ కాస్త సమయంలో హోదా కంటే కూడా తెలంగాణ ఎదుర్కుంటున్న సమస్యలపైనే ఎక్కువగా ప్రస్తావించాలని కేసీఆర్ తన సభ్యులకు సూచించారట. అంతే కాకుండ తమకు కేటాయించిన సమయంలో ప్రసంగించి తీర్మానం పై ఓటింగ్ వరకూ నిరీక్షించకుండా సభ నుంచి వెళ్లిపోవాలని టిఆర్ ఎస్ సభ్యులకు కేసీఆర్ సూచించారట. ఇదే జరిగితే సాటి తెలుగువారి పట్ల తెలంగాణ ముఖ‌్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎలాంటి ప్రేమ చూపించారో బహిర్గత మవుతుంది.