Begin typing your search above and press return to search.
పీడ రోజులు పోయాక ప్రమాణస్వీకారం ఉంటుందా?
By: Tupaki Desk | 3 Jan 2019 7:14 AM GMTమీకో లాటరీ తగిలిందనుకుందాం. ఆ వెంటనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. కానీ.. రావాల్సిన డబ్బులు వెంటనే రావటం తర్వాత.. ఎప్పుడు వస్తుందో తెలీకుంటే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలోని గెలుపొందిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇంచుమించు అలాంటి పరిస్థితే నెలకొంది. కారణం ఏమైనా కానీ.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించేందుకు అపసోపాలు పడిన నేతలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.
ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్న చందంగా కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయటం.. మహమూద్ ఆలీని హోం మినిస్టర్ గా ప్రమాణస్వీకారం చేయించటం తెలిసిందే. ఆ తర్వాత నుంచి తన పనిలో తానున్న కేసీఆర్.. తనతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించే ప్రోగ్రాం కానీ.. అసెంబ్లీని కొలువు తీర్చే ప్రక్రియను కానీ చేసింది లేదు. దాదాపు విజయం సాధించిన మూడు వారాల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో పీడ రోజులు పోయినాక ప్రమాణస్వీకారం ఉంటుందన్న మాట చెప్పారు.
అప్పటికైనా ఉంటుందా? అంటే అది కూడా డౌటే అన్న మాట ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావటం.. అది కాస్తా మూడు దఫాలుగా జరగటంతో.. కేసీఆర్ చెప్పినట్లుగా పీడ దినాలు పోయినాక కూడా అసెంబ్లీ కొలువు తీరే అవకాశం లేదన్నట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పగ్గాలు రెండోసారి చేపట్టిన కేసీఆర్ కు ఎలాంటి హడావుడి ఉండదు. కానీ.. ఎన్నికల్లో గెలిచినట్లుగా ఈసీ దగ్గర చిట్టీ తీసుకున్నా.. సాంకేతికంగా.. సంప్రదాయబద్ధంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయని వైనంపై పార్టీలకు అతీతంగా నిట్టూర్పులు వదిలే పరిస్థితి. ఇదేనా? అంటే.. ప్రస్తావించాల్సిన మరో అంశం కూడా ఉంది. అదేమంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రులు అవుతామని నమ్మకం పెట్టుకున్న నేతలకు ఇప్పుడు అదో పెద్ద తలనొప్పిగా మారింది.
మంత్రి పదవులు వచ్చేది రానిది క్లారిటీ లేకపోవటం ఒక ఎత్తు అయితే.. మంత్రులుగా నియమితులైతే చేసుకోవాల్సిన పనులు చాలానే పెట్టుకున్న వారంతా తీవ్ర నిరాశకు గురైనట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పీడ దినాలు అయ్యాక మంచిరోజున అసెంబ్లీ కొలువు తీరుతుందన్న మాటను కేసీఆర్ చెప్పినా.. వాస్తవరూపం దాల్చే పరిస్థితి ప్రస్తుతం లేదంటున్నారు. పీడ దినాలు అయిపోయిన వెంటనే.. పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న వేళ అసెంబ్లీ కొలువు తీరే అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో కేబినెట్ ఇప్పుడప్పుడే కొలువుదీరే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు.
అయితే.. తాను అనుకున్నదే తడువుగా ఏ పనైనా చేసే అలవాటున్న కేసీఆర్.. తనకు తానుగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చేయించాలనుకుంటే మాత్రం నిమిషాల్లో జరిగిపోతాయంటున్నారు. మరి.. కేసీఆర్ అలా ఎప్పుడు అనుకుంటారో చూడాలి.