Begin typing your search above and press return to search.
నిండు అసెంబ్లీలో మావోళ్లకే అన్నీ చెప్పేసిన కేసీఆర్
By: Tupaki Desk | 14 Nov 2017 4:49 AM GMT‘‘మహబూబాబాద్.. డోర్నకల్ ప్రాంతాల్లోని కాల్వ చివరి భూములకు 25 ఏళ్లుగా సాగునీరు రావడం లేదు. ఆ పరిస్థితి మారాలి. టెయిల్ ఎండ్‌కు నీరివ్వపోతే కాళ్లు విరగ్గొడతా అని మంత్రికి మీటింగ్‌లనే చెప్పిన. సీతారామ - దేవాదుల - కాళేశ్వరం ప్రాజెక్టులు - కృష్ణా జలాలతో అన్ని జిల్లాలకు సాగునీరు అందిస్తం. ›ప్రాజెక్టుల నీరు వచ్చేదాకా అందుబాటులో ఉన్న భూగర్భ జలాలతో పంటలు పండించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తాం"
‘‘కల్తీ విత్తనాలు - ఎరువులు - పురుగు మందులను నియంత్రించేందుకు ఆ కేసులను పీడీ చట్టంలో చేర్చాం. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 మంది ఏఈవోలను నియమించాం. ఇప్పటికే 46 శాతం భూరికార్డులను పూర్తి చేసిన రెవెన్యూ అధికారులను అభినందిస్తున్నా.. నకిలీలకు ఆస్కారం లేని కొత్త పాస్ పుస్తకాలను ఇస్తం. ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.8 వేల చొప్పున సాయం అందిస్తం. కౌలు రైతుల సంగతి ఏమిటని అడుగుతున్నారు. కౌలు రైతులు మా ప్రాధాన్యత కాదు. కౌలుదారుల చట్టం ప్రమాదకరం. అసలు దారులే మాకు ముఖ్యం. కౌలుదారులు ఏటా మారుతుంటరు. అసలు దారులే వారి గురించి ఆలోచించాలి"
"మీరంతా (కాంగ్రెస్ వారు) పదవుల్లో సేదదీరుతుంటే టీఆర్ ఎస్ కార్యకర్తలు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. అటుకులు తిని, అన్నం బుక్కి కొట్లాడి తెలంగాణ కోసం సాధించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం వారే కష్టపడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వారే రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉంటారు. సాగుభూమి లేనివారు సమితులలో సభ్యులుగా ఉండరు. అలా ఎక్కడైనా ఉంటే తొలగిస్తం. రాష్ట్ర రైతు సమన్వయ సమితిని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం న్యాయ పరిశీలనలో ఉంది. రైతులకు - అధికారులకు మధ్య వారధిగా రైతు సమన్వయ సమితులు ఉంటాయి"
‘‘ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు పోటీ ఉంటే రైతులు ధర పెడతరు. మండల రైతు సమన్వయ సమితులు ఈ విషయంలో ముందుగా స్థానిక వ్యాపారులకు చెబుతాయి. ధర రాని పరిస్థితులలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. వచ్చే ఏడాదే నేను చేసి చూపిస్త. మేం చేసేది తప్పయితే ప్రజాకోర్టులో మాకు శిక్ష తప్పదు. లేదంటే మేమే మళ్లీ నెగ్గి వస్తం"
సోమవారం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఇవి కొన్ని మాత్రమే. సీఎం నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. అంతులేని ఆత్మవిశ్వాసంతో పాటు.. ఏమైనా చేస్తామన్న ధీమా.. తామేం చేసినా ప్రజల ఆశీస్సులు తమవేనన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. అవును.. మా పార్టీ కార్యకర్తలకు మేం మేళ్లు చేసుకుంటామంటూ కుండబద్ధలు కొట్టే తెంపరితనం కనిపిస్తుంది. రైతు సమన్వయ సమితుల్లో తమ పార్టీ వారికే అవకాశం ఇవ్వనున్నట్లుగా తేల్చేసిన కేసీఆర్.. దానికి కారణం కూడా చెప్పేశారు.
ఈ మాటలన్నీ ఎక్కడో కాదు.. నిండు అసెంబ్లీ సభలో చెప్పటం విశేషం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అందరిని సమానంగా చూస్తానని చెప్పి మరీ చేసిన ప్రమాణాన్ని కేసీఆర్ తన తాజా మాటలతో తుంగలోకి తొక్కేసిన వైనం చూస్తే అధికారం ఎంతగా తలకెక్కిందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. ఇంతకాలం తెలంగాణ సాధన అందరి సమిష్టి కృషిగా చెప్పిన కేసీఆర్.. ఈ మధ్యన ఆ క్రెడిట్ తన ఖాతాలోకి.. ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తల ఖాతాలోకి మళ్లిస్తున్న వైనం చూస్తే.. తెలంగాణ సెంటిమెంట్ తో రానున్న రోజుల్లో మరింత చెలరేగిపోతారన్న సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేసే తీరు ఉన్న కేసీఆర్.. రాజకీయంగా తమకున్న అనుకూల వాతావరణంలో తమ బలాన్ని ఆయన తేల్చి చెబుతున్న తీరు ఆశ్చర్యపోయేలా ఉందని చెప్పాలి. ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం అందరికి ఉండాలి. కానీ.. తమ పార్టీ వారికే ఉంటుందంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన తీరు బరితెగింపునకు పరాకాష్ఠగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.