Begin typing your search above and press return to search.
కేసీఆర్ బడ్జెట్:లక్షా 80 వేల కోట్లు
By: Tupaki Desk | 9 Jan 2018 5:26 AM GMTతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో..ఈ సారి భారీ బడ్జెట్ ఉండనున్నట్లు అంచనా. 2018-19 బడ్జెట్ ను అత్యంత ప్రగతిశీలంగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి కల్పన - బీసీలకు కేటాయింపుల పెంపుతో పాటు.. శరవేగంగా సాగుతున్న నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ ..సంక్షేమ అభివృద్ధి రంగాల మధ్య సమతుల్యం పాటించేలా బడ్జెట్ ఉండనుంది. ఈ మేరకు ప్రగతి పద్దుకు నిధుల కేటాయింపు అధికంగా ఉండనుంది. తద్వారా రికార్డు స్థాయి కేటాయింపులు జరగనున్నట్లు సమాచారం రానున్న వార్షిక బడ్జెట్ అంచనాలు కనీసం 15 శాతం అధికంగా ఉండొచ్చని సమాచారం.
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నందున...ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కూడా వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? జీఎస్టీ తరువాత అభివృద్ధి రేటు ఎలా ఉంది? రాష్ట్రాల వాటా కింద కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఎన్ని? అభివృద్ధి రేటు ఎలా ఉంది? వంటి అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థూలంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. పెట్రోల్ - ఎక్సైజ్ ద్వారా వస్తున్న ఆదాయంతోపాటు స్టేట్ జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా కలిపి 19 శాతం వృద్ధిరేటు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెరిగిన రాష్ట్ర వృద్ధిరేటును పరిశీలించిన అధికారులు 2018-19 వార్షిక బడ్జెట్ దాదాపుగా రూ.1.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని రంగాల సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందిస్తున్నారు. కొత్త బడ్జెట్ లో అత్యంత ప్రధానంగా రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి పథకానికి పెద్దమొత్తంలో నిధుల కేటాయింపు జరుగుతోంది. భూ ప్రక్షాళన కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలపై ప్రభుత్వానికి మరింత స్పష్టత వచ్చింది. దీంతో పాటు రుణమాఫీ కూడా పూర్తైనందున రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నారు. ఈ మేరకు పెట్టుబడి పథకాన్ని ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రారంభించనున్నారు. మరోవైపు ఈ సారి బీసీ సంక్షేమానికి కేటాయింపులు అధికంగా ఉండనున్నట్టు సమాచారం.
కాగా, బడ్జెట్ ప్రతిపాదనలు మొదట ఈనెల 9వ తేదీవరకు ఆన్ లైన్ లో పంపించాలని ఆర్థికశాఖ అన్నిశాఖలను ఆదేశించింది. కానీ ఈ సమావేశంలో కార్యదర్శులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈనెల 17వ తేదీ వరకు పొడిగించారు. 17వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆయాశాఖలు తమ ప్రతిపాదనలను ఆన్ లైన్ లో పంపించాలని ఈ సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.