Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాట:థర్డ్ ఫ్రంట్ కాదు..భారత ప్రజల ఫ్రంట్
By: Tupaki Desk | 14 March 2018 12:26 PM GMTదేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాను అనే అంశంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదని, ప్రజల ఫ్రంట్ అని వెల్లడించారు. రిజర్వేషన్ల పెంపు విషయాన్ని శాసనసభలో సభ్యులు ప్రస్తావించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాను జాతీయ రాజకీయాల కోసం పోతానని ప్రకటించిన తర్వాత కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. `ఒక మూడు నాలుగు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి థర్డ్ ఫ్రంట్ అని కథ నడుపుతాడు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. నేను చిల్లర రాజకీయాల కోసం భారత రాజకీయాల్లోకి పోవడం లేదు. దీని వెనుక పెద్ద ఎజెండా ఉంది. ఇది థర్డ్ ఫ్రంట్ కాదు. ఇంకో ఫ్రంట్ కాదు. భారత ప్రజల ఫ్రంట్`అని వెల్లడించారు.
తన జాతీయ రాజకీయాలను సైతం తెలంగాణ ఉద్యమం వంటిదేనని కేసీఆర్ వివరించారు. `నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు కూడా వెకిలి చేశారు. కానీ విజయం సాధించాం.. ఆ విధంగానే ఈ ఫ్రంట్ కూడా విజయం సాధిస్తుంది. అప్పుడే రిజర్వేషన్లు మనం అనుకున్నట్లు సాధించుకోవచ్చు - ఎస్సీ - ఎస్టీలు బాగుపడుతారు. మూసపద్ధతిలో ప్రజలు బాగుపడరు.`అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. విమోచన దినం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. `తెలంగాణ విమోచన దినం అని పేరు పెట్టింది వీళ్లు అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీళ్లకు ఓ ఉద్దేశం ఉంటది. అది ప్రపంచానికి తెలుసు అని సీఎం తెలిపారు. నిజాం సంస్థానం నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంగా రూపాంతరం చెందింది. అది విమోచన కాదు.. పాడు కాదు.. ఒక్కొక్కరు ఒక పేరు పెడుతారు. భారతదేశంలో విలీనం అయిపోయాం.తెలంగాణ విమోచనం దినం జరపాలనే బీజేపీ డిమాండ్ లో అర్థం ఏమిటో అందరికీ తెలిసిందే. తెలంగాణకు అసలైన విమోచన దినం జూన్ 2 - దాన్ని ఘనంగా జరుపుతాం. ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజే అసలైన విమోచన దినం. కుల - మతాలను రెచ్చగొట్టే రోజులు నిర్వహించాలంటే మేం నిర్వహించం` అని సీఎం స్పష్టం చేశారు.
శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. `తెలంగాణకు చెడ్డపేరు తీసుకువచ్చే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వను. ప్రజలు సోదరభావంతో మెలగాలి. ముస్లింల నుంచి విమోచనం అయినట్లు ఈ రైటిస్టులు చిత్రీకరిస్తారు. అది బీజేపీ కోణం. మీ కోణం మాకు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దు. ప్రజలను కలిపి తీసుకుపోవాలి. జూన్ 2 కంటే మించింది కాదు కదా? విమోనం అని ప్రశ్నించారు. జూన్ 2 నిజమైన విమోచన. తెలంగాణ ప్రజలకు నిజమైన విమోచన ఆ రోజే. జూన్ 2న ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.` అని సీఎం తెలిపారు.